‘బాహుబలి 2’ షూటింగ్ లో బిజీగా ఉన్న రాజమౌళి మళ్ళీ ‘బాహుబలి 3’ ప్రస్తావన ఒక బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీసుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం మీడియాలో రాజమౌళి ‘బాహుబలి 3’ కూడ తీయబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు గత సంవత్సరం అక్టోబర్ లో రాజమౌళి ఈవిషయమై తన ట్విటర్ లో స్పందిస్తూ ‘బాహుబలి’ కథ ‘బాహుబలి 2’ తో పూర్తి అయిపోతుందని అధికారికంగా తెలియచేసాడు.

ఒకవేళ భవిష్యత్ లో తాను ‘బాహుబలి 3’ ని తీయవలసి వస్తే అది కేవలం ‘బాహుబలి’ పాత్రకు మాత్రమే కొనసాగింపుగా ఉంటుంది కాని ప్రస్తుతం నటిస్తున్న నటీనటులు ఎవ్వరూ ‘బాహుబలి 3’ లో ఉండరు అన్న సంకేతాలు ఇచ్చాడు రాజమౌళి. అయితే ఈమధ్య ఒకజాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో రాజమౌళి మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్లుగా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాను ‘బాహుబలి 3’ ఖచ్చితంగా తీస్తానని ‘బాహుబలి’ కథ చాల పెద్దది అని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ‘బాహుబలి 3’ కి పేరు మారవచ్చు అన్న భావంతో రాజమౌళి స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిఇలా ఉండగా రాజమౌళి మొదటగా అనుకున్న ‘బాహుబలి 2’ కథకు చివరికి వచ్చేసరికి చాలమార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ‘బాహుబలి 2’ తో ‘బాహుబలి’ పాత్రను పూర్తిగా ముగించి వేయకుండా ఒకచిన్న ట్విస్టును ‘బాహుబలి 2’ చివర్న ఇవ్వడానికి రాజమౌళి ఇప్పటికే డిసైడ్ అయినట్లు టాక్. అయితే ఈవిషయాన్ని ప్రస్తుతం రాజమౌళి చాలగుట్టుగా ఉంచుతున్నాడు అని తెలుస్తోంది. 

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి’ టెంపో ఏమాత్రం సడలకుండా చూసేందుకు డైరెక్టర్ రాజమౌళి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. దీనికోసం గ్రాఫిక్స్ ఇండియాతో కలిసి ఈమూవీ యూనిట్ బాహుబలి ది బిగినింగ్ కామిక్స్ ను రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే ఈకామిక్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసినవిషయం తెలిసిందే. యూనివర్స్ ఆఫ్ బాహుబలి పేరిట వచ్చే ఈకామిక్స్ లో యానిమేషన్స్, గేమ్స్ కూడా ఉంటాయని  టాలీవుడ్ లో టాక్. అయితే త్వరలో రిలీజ్ కాబోతున్న ఈకామిక్స్ లో కట్టప్ప  గుట్టు రాజమౌళి విప్పెశాడు అన్న వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాకు అత్యంత కీలకం అయిన ఈసస్పెన్స్ ను అప్పుడే రాజమౌళి బయటపెడతాడా అన్నదే సందేహం..


మరింత సమాచారం తెలుసుకోండి: