కెరియర్ పై ఎటువంటి అవగాహన అయినా ఉండుందా లేక ఏదో సినిమాలు చేస్తున్నాం అంటే చేస్తున్నాం హిట్లు కొడుతున్నాం అనుకుంటున్నాడో ఏమో కాని రాజ్ తరుణ్ కెరియర్ ఇప్పుడు పెద్ద సందిగ్దంలో పడ్డది. ప్రస్తుతం చేతిలో రెండు మూడు సినిమాలున్నా తను హీరోగా ఇటీవల రిలీజ్ అయిన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా ఫ్లాప్ అనేస్తున్నారు. 


అయితే మూడు సినిమాల హిట్ తో హ్యాట్రిక్ కొట్టిన ఈ హీరో అదే నమ్మకంతో ఈ సినిమా కూడా దంచేస్తాడని అనుకున్నారు. తీరా సినిమా వచ్చేసరికి ప్రేక్షకులు పెదవి విరిచేలా చేసింది. రాజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అనుకుంటే అది కాస్త తనకు షాక్ మిగిల్చింది. తన స్నేహితుడు దర్శకుడు శ్రీనివాస్ గోవిరెడ్డి మీద నమ్మకంతో తీసిన ఈ సినిమా రాజ్ కు చేదు జ్ఞాపకమే అని చెప్పాలి. 


సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత లాభాలకు అమ్ముకున్నా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ప్రేక్షకులు లేక థియేటర్స్ అన్ని ఖాళీలవుతున్నాయని వాపోతున్నారు. ప్రస్తుతం క్రేజ్ ను క్యాష్ చేసుకుని సేఫ్ సైడ్ ఉందామనుకున్న రాజ్ కు ఈ సినిమా పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. అయితే ఇలాంటి టైంలో కెరియర్ పై మంచి ఏకాగ్రతతో సినిమాలు చేస్తే బెటర్ లేదంటే ఇలానే రెండు వరుసెంట ఫ్లాపులు పడ్డాయంటే రాజ్ కెళ్లి చూసే దర్శక నిర్మాత ఉండడని చెప్పొచ్చు.


ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాల సక్సెస్ తో తనకు తిరుగులేదు అనుకున్న రాజ్ తరుణ్ సీతమ్మ ఇచ్చిన షాక్ కు తలకిందులవుతున్నాడు. ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో హిట్ కొడితేనే మార్కెట్ లేదంటే ఎవరు సరైన రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం లేదు. మరి ఇకనుండైనా రాజ్ కెరియర్లో ఇలాంటి సినిమాలు తీయకుండా మళ్లీ హిట్ అందుకుంటే బెటర్.. లేదంటే ఇక రాజ్ పని అయిపోయినట్టే..!



మరింత సమాచారం తెలుసుకోండి: