ఏప్రిల్ ఎనిమిదిన సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అనే న్యూస్ ఎప్పటి నుంచో హల్చల్ చేస్తోంది. లేటు లేటు గా టైం తీసుకుని షూటింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ షూటింగ్ కూడా నెమ్మది నెమ్మదిగా నే మొదలెట్టాడు అయితే మొత్తానికి పూర్తి చెయ్యడానికి దగ్గర పడింది ఈ సినిమా. ఇప్పుడు నిర్మాణ వర్గానికి సన్నిహితంగా ఉండే వారు మీడియా కి ఏప్రిల్ 8  డేట్ ని పక్కా అని చెప్పేశారు .

 

 

 దాదాపు అరవై రోజుల టైం అయితే ఉంది పవన్ కళ్యాణ్ కి. ఈ టైం విడుదల కీ షూటింగ్ పూర్తి చెయ్యడానికీ సరిపోతుందా లేదా అనేది చూడాలి. ఇంకా టాకీ కూడా అవని సర్దార్ సినిమా విదేశాలకి వెళ్లి పాటలు పూర్తి చేసుకోవాల్సి ఉంది. టాకీ పార్ట్ ఇంకా సగం లోనే ఉంది అని మన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి పరిస్థితి లో అయినా టాకీ పార్ట్ , పాటలూ ముప్పై రోజులలో పూర్తి చెయ్యాలని పవన్ బృందం సీరియస్ గా ఉందట. ఆ తరవాత ఇరవై రోజులూ రీరికార్డింగ్ మీదా ఎడిటింగ్, డీటీఎస్ లాంటి పనుల మీద కూర్చుంటారు.

 

 

ఇక్కడ నుంచి పక్కగా ప్లాన్ చేసుకుని బండి చాలా ఫాస్ట్ గా ప్లాన్ చేస్తే తప్ప ఆ డేట్ ని రీచ్ అవ్వడం కష్టమే. పైగా ఇది పవన్ కళ్యాణ్ సినిమా , పవన్ కళ్యాణ్ సినిమాలు వాయిదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ లూ. ఈ లోగా ఏదైనా రాజకీయ పని పడితే పవన్ కళ్యాణ్ కూడా చక్కగా పక్కకి పోయే ఛాన్స్ ఉంది. సో సమ్మర్ సీజన్ లో విడుదల చేసి సూపర్ హిట్ కొట్టాలి అని చూస్తున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కళ్యాణ్ విందు ఇస్తాడో ఇవ్వడో మరి !

 


మరింత సమాచారం తెలుసుకోండి: