ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే స్టార్ కి లేదనే చెప్పాలి. కేవలం స్టైల్ కి ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కూడ ఒక్క రజనీకాంత్ కి మాత్రమే చెల్లింది. కండెక్టర్ గా ఉన్న రజనీకాంత్ సూపర్ స్టార్ లా ఎలా మారాడు? అన్న కోణంలో రజనీకాంత్ జీవిత ప్రయాణాన్ని తెలుసుకుంటే ప్రతీ ఒక్కరూ ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఆ విధంగానే ప్రస్తుతం మణిరత్నం, రజనీకాంత్ జీవిత కథని తెరపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

నిజ జీవిత గాథలను తెరకెక్కించడంలో మణిరత్నంది ప్రత్యేక శైలి. ఇద్దరు, ‘గురు’ వంటి సినిమాలు మణి రత్నంకి మంచి పేరుని తీసుకువచ్చాయి. ప్రముఖులైన వ్యక్తుల జీవిత కథలను మణిరత్నం తనదైనశైలిలో తెరకెక్కించి మెప్పించగలరు. అయితే తాజాగా మణిరత్నం, రజనీకాంత్ వద్దకు వెళ్ళి…రజనీకాంత్ జీవిత కథలో అసలైన రజనీకాంత్ నటిస్తేనే బాగుంటుందని చెప్పుకువచ్చాడంట. అయితే రజనీకాంత్ మాత్రం తన జీవితకథని తెరపైకి తీసుకురావటం ఎంత వరకు కరెక్ట్? అనే ఆలోనలో ఉన్నాడు.

తను ఇప్పటి వరకూ ఫిల్మ్ ఇండస్ట్రీలో తప్ప మరే రంగంలోనూ వేలుపెట్టలేదు. రాజకీయంగా అడుగులు వేయాలని అభిమానులు చెప్పినప్పటికీ…రజనీకాంత్ అందుకు సిద్ధంగా లేనని చెప్పుకొచ్చారు. అయితే మణిరత్నం మాత్రం ఈ విషయంలో రజనీకాంత్ పై ఒత్తిడి తీసుకువస్తున్నాడంట. రజనీకాంత్ జీవితకథలో రజనీకాంత్ మాత్రమే నటించాలన్నది మణిరత్నం డిమాండ్.

ఇందుకు రజనీకాంత్ ఒప్పుకుంటాడా? లేదా? అనేది త్వరలోనే తెలియాల్సి ఉంది. సరిగ్గా పాతికేళ్ళ క్రితం రజనీకాంత్-మణిరత్నంల కాంబినేషన్‌లో వచ్చిన దళపతి సినిమా, ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఒకవేళ రజనీకాంత్ జీవిత చరిత్ర అన్నీ అనుకున్నట్టుగా తెరపైకి వస్తే…వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ బాక్సాపీస్ ని షేక్ చేస్తుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: