‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ లో పవన్ కాజల్ లు కలిసి నటిస్తున్నా వారిద్దరు కలిసి ఉన్న ఒక్క ఫోటో స్టిల్ కూడ ఇప్పటి వరకు లీక్ కాకపోవడంతో వీరిద్దరి జంట ఎలా ఉంటుంది అన్న ఆత్రుత పవన్ అభిమానులలో ఉంది. అయితే పవన్ ప్రస్తుతం బిజీగా ఉన్న కేరళా షూటింగ్ స్పాట్ లో కాజల్ పవన్ తో కలిసి కెమేరాకు పోజు ఇచ్చిన ఒక స్టిల్ ఇప్పుడు బయటకు లీక్ అయింది.

ఈ ఫోటో ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడంతో పవన్ అభిమానులు అంతా ఈ ఫోటోను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. పవన్ పక్కన కాజల్ చాల గ్లామర్ గా కనపడుతోంది అని కొoదరు కామెంట్ చేస్తూ ఉంటే కాజల్ లుక్స్ ముందు పవన్ కళ్యాణ్ లుక్స్ అంతగా సరితూగలేదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ స్టిల్ పవన్ కాజల్ ల మధ్య చిత్రీకరించిన యాక్షన్ సీన్ లోనిదా ? లేదంటే వీరిద్దరి మధ్య కేరళా ప్రాంతంలో ఏదైనా డ్యూయట్ చిత్రీకరిస్తున్నారా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో కాజల్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా ‘సర్దార్’ కావడంతో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది అన్న ఆ శక్తి కూడ పవన్ అభిమానులలో ఎక్కువగా ఉంది. 

రామ్ చరణ్ తో ‘మగధీర’ లో నటించి కాజల్ టాప్ హీరోయిన్ లిస్టులో చేరిపోయినా ఆ తరువాత ఆ స్థానాన్ని కాజల్ ఎక్కువ కాలం టాలీవుడ్ లో కొనసాగించలేకపోయింది. ప్రస్తుతం ఆమె కోల్పోయిన ఆ టాప్ హీరోయిన్ స్థానాన్ని ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తనకు మళ్ళీ అందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది కాజల్..  


మరింత సమాచారం తెలుసుకోండి: