పవన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ ఘన విజయంలో పవన్ పంచ్ డైలాగ్స్ తో పాటు పవన్ నటించిన అంత్యాక్షరి సీన్ ఆ సినిమాకు గుండెకాయగా మారడమే కాకుండా కేవలం ఆ అంత్యాక్షరి సీన్ చూడటం కోసమే అనేక సార్లు ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు ఉన్నారు అంటే ఆ సీన్ ఆ సినిమాకు ఎంత కీలకంగా మారిందో అర్ధం అవుతుంది. ఈ సినిమా ఘనవిజయం తరువాత అనేక మంది దర్శకులు తమ సినిమాలలో ఈ అంత్యాక్షరి పై పేరిడీ సీన్స్ కూడ పెట్టారు.
అయితే కోలీవుడ్ టాప్ హీరో విజయ్ పోలీసుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ఈ అంత్యాక్షరి సీన్ ను డిటోగా కాపీ కొట్టి విజయ్ తన పోలీసు స్టేషన్ లో ఉన్న క్రిమినల్స్ చేత ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ రైమ్ ను అంత్యాక్షరి చేయిస్తూ విజయ్ పోలీసు ఆఫీసర్ గా కర్ర పుచ్చుకుని చేసిన వీరంగం విజయ్ నటిస్తున్న ధేరి సినిమాకు హాట్ టాపిక్ గా మారుతుందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు విడుదలైన కేవలం 12 గంటలలో 1.34 (లక్షా ముప్పై నాలుగువేల) లైక్స్ వచ్చాయి అంటే విజయ్ స్టామినా అర్ధం అవుతుంది. ‘పులి’ సినిమా ఘోరపరాజయం చెందిన నేపధ్యంలో పోలీసు ఆఫీసర్ గా విజయ్ తన మాస్ లుక్ అవతారంతో ఈ సినిమాలో తన అభిమానులకు జోష్ ను ఇవ్వబోతున్నాడని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.
ఈ సంవత్సరం సమ్మర్ లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ఈ సినిమాలో విజయ్ కొన్ని పొలిటికల్ పంచ్ లు వేశాడని కూడ తెలుస్తోంది. రజినీకాంత్ అజిత్ ల తరువాత విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ నటిస్తున్న ఈ మూవీ ఘన విజయం సాధిస్తుందని విజయ్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు..