టాలీవుడ్ ఎంపరర్ గా 70 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డులను తిరిగి రాసిన పవన్ ‘అత్తారింటికి దారేది’ రికార్డులు  ‘బాహుబలి’ విడుదల తరువాత తుడిచి పెట్టుకు పోయిన సంగతి తెలిసిందే. అయితే ఏదోవిధంగా మరోసారి కలెక్షన్స్ సునామి సృష్టిద్దామని ప్రయత్నిస్తూ ఈసమ్మర్ రేస్ కు రాబోతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ ‘బాహుబలి’ సెంటిమెంట్ ను అనుసరిస్తోంది. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళాలోని ఒక అందమైన ప్రాంతంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న వాటర్ ఫాల్స్ ప్రాంతంలోనే ‘బాహుబలి’ షూటింగ్ జరిగింది. రాజమౌళి కేరళలోని అధిరిపల్లె వాటర్ ఫాల్స్ దగ్గర ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తూ శివలింగo ఎత్తిన సన్నివేసాలు చిత్రీకరించారు. ఆ సినిమాకు ఆ సీన్ ఎంత కీలకంగా మారిందో తెలిసిన విషయమే.

ఇప్పుడు అదే వాటర్ ఫాల్స్ దగ్గర పవన్ కాజల్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో కథకు సంబంధించి ఈ సీన్స్ చాల కీలకంగా ఉంటాయని టాక్. ఇండియన్ నయాగరా ఫాల్స్ గా పేరు గాంచిన ఈ అధిరిపల్లె వాటర్ ఫాల్స్ ఎంత అందంగా కనిపిస్తాయో అక్కడ షూటింగ్ చేయడం అంత కష్టం. 

అయితే ‘బాహుబలి’ సెంటిమెంట్ ను అనుసరిస్తూ ఇదే వాటర్ ఫాల్స్ దగ్గర ‘సర్దార్’ సినిమా యూనిట్ చాల శ్రమతో ఈ సీన్స్ ను చిత్రీకరించారని టాక్. ఇప్పటికే ఈసినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో బయ్యర్ల నుండి విపరీతమైన డిమాండ్ వస్తున్న నేపధ్యంలో పవన్ తన కలక్షన్స్ స్టామినాను నిరూపించే సినిమాగా ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ను చాల పట్టుపట్టి శ్రద్ధతో పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి ‘బాహుబలి’ లోని వాటర్ ఫాల్స్ సెంటిమెంట్ ఎంత వరకు పవన్ కు విజయాన్ని ఇస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: