సంక్రాంతి సినిమాల హడావిడి అంతా పూర్తి అయిపోయింది. సంక్రాంతి తరువాత వచ్చిన రాజ్ తరుణ్ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, బెల్లంకొండ శ్రీను ‘స్పీడున్నోడు’ కేవలం ఏవరేజ్ మార్కులు వేయించు కోవడంతో ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం జరగబోతున్న నాని దండయాత్ర పై పడింది. ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తరువాత నానీకి పెరిగిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి వస్తున్న ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. 

అయితే మంచి క్రేజ్ లో ఉన్న నాని హవాకు అడ్డుకట్ట వేయడానికి హీరో ఆది చేస్తున్న సాహసమే ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. ఈమధ్య కాలంలో వరస పరాజయాలతో సతమతమైపోతున్న ఆది తన తండ్రి సాయికుమార్ ను నిర్మాతగా చేసి తనలోని మాస్ లుక్ ను చూపెట్టడానికి ఆది ‘గరం’ సినిమాతో చేస్తున్న ప్రయత్నాలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

అయితే యంగ్ హీరో నాని దండయాత్ర ముందు ఆది ఎంత వరకు నిలబడగలడు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో నాని బాలకృష్ణ వీరాభిమానిగా కనిపిస్తూ ఒక
వెరైటీ పాత్రను డిఫరెంట్ యాంగిల్ లో చేస్తున్న సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ ప్రస్తుతం ఏ సినిమాకు అయినా ఓవర్ సీస్ కలెక్షన్స్ ఆయువుపట్టుగా మారిన నేపధ్యంలో నానీకి ప్రస్తుతం ఓవర్సీస్ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ తో అమెరికాలో ఈసినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా చల్లారిపోవడంతో పాటు వచ్చే వారం యూత్ కు నచ్చే ఎంతో ఇష్టమైన వాలెంటైన్స్ డే రాబోతున్న నేపధ్యంలో ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది. దీనికితోడు ఈ సినిమాను తీసిన 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈసినిమా ప్రమోషన్ ను చాల భారీ ఎత్తులో చేయబోతోంది అని టాక్. ఈ పరిస్థుతుల నేపధ్యంలో నాని సునామీకి ఎదురు నిలబడి ఆది ‘గరం’ చేస్తున్న సాహసం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: