‘బాహుబలి’ తరువాత మళ్ళీ పేరులోకి వచ్చిన తమన్నాకు ఆమెకు అవంతిక పాత్ర ఇచ్చిన స్థాయిలో టాలీవుడ్ లో అవకాశాలు రావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమన్నా ‘బాహుబలి 2’ నాగార్జున కార్తీల ‘ఊపిరి’ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు తప్ప తమన్నాకు టాలీవుడ్ లో చెప్పుకోతగ్గ మరి ఏ భారీ ఆఫర్ ఈమధ్య కాలంలో రాలేదు. 

మొన్న విడుదల అయిన ‘స్పీడున్నోడు’ సినిమాలో ఐటమ్ సాంగ్ ను చేయడమే కాకుండా ఆ ఐటమ్ సాంగ్ లో తమన్నా చేసిన ఎక్స్ పోజింగ్ చూసి అందరూ అదిరిపోయారు. ఆ చిన్న సినిమాను ప్రమోట్ చేస్తూ తమన్నా కామెంట్స్ చేయడమే కాకుండా ఎదో విధంగా తిరిగి టాప్ యంగ్ హీరోలతో సినిమాలు చేయడానికి తమన్నా తన గ్లామర్ ఎక్స్ పోజ్ చేయడానికి ‘స్పీడున్నోడు’ సినిమాలోని ఐటమ్ సాంగ్ ను ఒక సాధనంగా వాడుకుందా ? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

అయితే మన టాప్ యంగ్ హీరోలు అయిన మహేష్ చరణ్ అల్లుఅర్జున్ జూనియర్ లు తాము రానున్న రోజులలో నటించబోయే ఏ సినిమాలోను తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసుకునే ఉద్దేశ్యం వ్యక్త పరచకుండా శ్రుతిహాసన్ రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ వైపు మన టాప్ యంగ్ హీరోల దృష్టి పడటం తమన్నాకు అర్ధం కాని ప్రశ్నాగా మారింది అని టాక్. 

కాజల్ లాంటి హీరోయిన్స్ కు కూడ మహేష్ పవన్ సినిమాలలో అవకాశాలు వస్తే ప్రస్తుతం ఏ టాప్ హీరో తమన్నా పేరును తలవక పోవడం చాలామందికి అర్ధం కాని ప్రశ్నగా మారింది. దీనికితోడు చాలామంది యంగ్ హీరోలు ఆమెతో నటిద్దామని ఆరాట పడుతున్నా ప్రస్తుతం చుక్కలు తాకుతున్న ఆమె భారీ పారితోషికo సమస్య వల్ల కూడ చాల అవకాశాలు ఆమెకు దూరం అవుతున్నాయి అన్న కామెంట్స్ ఉన్నాయి. దీనితో ఆమె ప్రస్తుత పరిస్థితి టాప్ హీరోలకు తక్కువ  యంగ్ హీరోలకు ఎక్కువగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: