సినిమా ఎంత గొప్పగా వచ్చినా.. ఎంత పెద్ద హిట్ అయినా.. సినిమాలో ఎంత పెద్ద స్టార్ కాస్ట్ నటించినా సినిమా అన్ని విధాలుగా అవుట్ పుట్ బాగా రావడానికి సహకరించే వారే సహాయక దర్శకులు. ఓ దర్శకుడి ఆలోచనలకు తాము కూడా తోడై అతని అడుగుజాడల్లో నడుస్తూ అతని నియమ నిబంధనలు పాటిస్తూ సినిమా కోసం పనిచేసే వారే సహాయక దర్శకులు.


అభిరుచి గల దర్శకుల్లో ఒకరిగా గుణశేఖర్ కు మంచి పేరు ఉంది. లాటి సినిమాతో మొదలైన గుణశేఖర్ సిని ప్రస్థానం దాదాపు 25 సంవత్సరాల సినిమా కెరియర్ లో 12 సినిమాలకు గాను 5 సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన రుద్రమదేవితో చరిత్రకు అద్దం పట్టే సినిమాలను తీయగల సత్తాకూడా తనలో ఉందని నిరూపించాడు దర్శకుడు గుణశేఖర్. ఇక రుద్రమదేవి ఎండ్ కార్డ్ లో ప్రతాపరుద్రుడు సినిమా అంటూ వేశారు. 


మరి ఆ సినిమా ఉంటుందో లేదో ఇంతవరకు ఊసే లేదు. రుద్రమదేవి రిలీజ్ తర్వాత గుణశేఖర్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు అనుకున్నారు. కాని ఇప్పుడు ఆయన దర్శకత్వ శాఖలో పనిచేసే టాలెంటెడ్ అసిస్టెంట్స్ కోసం వెతుకుతున్నారట. తన దగ్గర అప్రెంటీస్ గా మరియు అసిస్టెంట్ దర్శకులుగా పనిచేయడానికి అవకాశం ఉంది అని తానే ట్విట్టర్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. 


ఇంట్రెస్ట్ కలిగిన వారు  gteamworks.contact@gmail.com మెయిల్ ఐడికి తమ రెస్యూంని సెండ్ చేయాలట. మరి ఇంకెదుకాలస్యం మీరు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేయాలనుకుంటే గుణశేఖర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోండి. ఒక మంచి దర్శకుడి దగ్గర సిని రంగ పాటాలు నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.


మరింత సమాచారం తెలుసుకోండి: