ఒకవైపు రాజమౌళి ‘బాహుబలి 2’ షూటింగ్ కు సంబంధించిన ఒక్క వర్కింగ్ స్టిల్ కూడ బయట పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఈసినిమాలో నటిస్తున్న రానా ఈసినిమా గురించి చిన్నచిన్న లీకులు ఇస్తున్నాడు.  ఒక తమిళ మీడియా సంస్థకు రానా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాహుబలి 2’ పై ఇతడు ఆ శక్తికర కామెంట్స్ చేసాడు. ‘బాహుబలి’ ది కంక్లూజన్‌ చూసాక 'బాహుబలి’ ది బిగినింగ్‌ చాలా చిన్న సినిమాలా కనిపిస్తుందని రానా సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

రాజమౌళి ఈసినిమాను తొలి భాగం కంటే ఎన్నో రెట్లు మెరుగ్గా ఉండేలా ‘బాహుబలి-2’ ను తీస్తున్నాడని అంటూ ఇందులోని  సెట్టింగ్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, యుద్ధ సన్నివేశాలు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని కామెంట్స్ చేసాడు రానా. అంతేకాదు ఈసినిమా తొలి భాగంలో కనిపించిన కొన్ని లోపాల్ని కూడా దిద్దుకుని మరింత మంచి ఔట్‌ పుట్‌ తేవడానికి 'బాహుబలి' టీమ్‌ కష్టపడుతోందని రానా వ్యాఖ్యలు చేసాడు. అయితే అదే మీడియా సంస్థ ప్రతినిధి ‘బాహుబలి 2’ కథలోని విషయాలు గురించి లోతుగా అడిగినప్పుడు ఇంతకు మించి తాను మరేమీ చెప్పలేను అని అంటూ తప్పించుకున్నాడు రానా. 

ఇక తన కెరియర్‌ గురించి మాట్లాడుతూ మూడు భాషల్లో అద్భుతమైన సినిమాలు చేస్తుండటం తన అదృష్టం అని చెపుతూ తాను నటుడిగా తన కెరియర్ ను ప్రారంభించినప్పుడు తాను ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడ అనుకోలేదు అని కామెంట్ చేసాడు రానా. ఇదే సందర్భంలో తనకు సినిమా రంగంలో అత్యంత ఇష్టమైన వ్యక్తులు అనుష్క అజిత్ లు అని చెపుతూ వాళ్ల లాంటి వ్యక్తుల్ని తానెక్కడా చూడలేదని వాళ్లతో తాను గడుపుతున్నపుడు తనకు తాను చాలా చెడ్డ వాడిలా అనిపిస్తానని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు రానా. 

అంతేకాదు ఇప్పట్లో తనకు పెళ్ళి ఆలోచన లేదని తన పెళ్ళి పై వస్తున్న గాసిప్పులను కొట్టి పారేసాడు రానా. ఇప్పటికే బాలీవుడ్ లో అనేక ఆఫర్లు అందుకుంటున్న రానా ‘బాహుబలి 2’ విడుదల తరువాత మరింత పాపులారిటీ సంపాదించుకునే ఆస్కారం ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: