పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తన అప్ కమింగ్ మూవీ విషయంలో తీసుకున్న ఓ నిర్ణయానికి తను కట్టుబడి ఉన్నానని అంటున్నాడు. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొన్ని సినిమాలకు ఇబ్బంది కలిగే పరిస్థితిలా ఉంది.  దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ప్రస్తుతం షూటంగ్ ని శరవేగంగా జరుపుకుంటుంది.


ఈ మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ పూర్తి స్థాయి హీరోగా ఈ మూవీలో కనిపించనున్నాడు. మధ్య లో వచ్చిన గోపాల గోపాల మూవీ సైతం బ్లాక్ బస్టర్ కావటంతో, ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే సర్ధార్ మూవీపై ఎన్నడూ లేనంతగా అన్నిచోట్ల నుండి ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ అధిరిపోయింది.


సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమా విడుదల కానుంది. అందుకు తగ్గట్టుగా ఈ చిత్ర టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంది. ఇక ఈ మూవీ డైలాగ్ టీజర్, ఆడియో ఫంక్షన్, ప్రమోషన్స్ వంటి విషయాలపై పక్కా క్లారిటీతో ఉంది. గతంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, ఏప్రిల్ నెలలో సినిమా విడుదలయ్యే అవకాశమే లేదనే ప్రచారం జరగటంతో…కొన్ని సినిమాలు ఏప్రిల్ లో రిలీజ్ కి ప్లాన్ చేసుకన్నాయి.


ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్ధార్ మూవీతో ఎప్రిల్ 8న వస్తున్నారని క్లారిటి రావటంతో ఇప్పటి వరకూ ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాల రిలీజ్ టైం గంధరగోళంలో పడ్డాయి. ఇక చిన్న సినమాలు సమ్మర్ లో రిలీజ్ చేసుకునేందుకు ఎక్కడా ఛాన్స్ దొరకటం లేదు. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండటంతో చిన్న సినిమాలు సమ్మర్ మార్కెట్ ని క్యాష్ చేసులేకపోవచ్చని అంటున్నారు. ఎప్రిల్ ఇప్పటికే 6 చిన్న సినిమాలు రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాయి. పవన్ కళ్యాన్ మాత్రం ఎప్రిల్ 8న తన మూవీ అనటంతో...చిన్న మూవీల పరిస్థతి గంధరగోళంలో పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: