నాని వ్యూహాత్మక ఎత్తుగడకు బాలకృష్ణ అభిమానులు షాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేచురల్ స్టార్ తాను నటిస్తున్న ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఈ కామెంట్స్ చేసాడు.  ఈ మూవీలో తాను నందమూరి బాలకృష్ణ వీరాభిమానిగా చేతి పై ‘జై బాలయ్య’ అనే టాటూ వేయించుకుని కనపడతాను కాబట్టి ఈ సినిమాకి మొదట ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడతారు అనే ప్రచారం జరిగిందని  అంటూ అసలు తమ సినిమాకి ‘జై బాలయ్య’ టైటిల్ పెట్టే ఆలోచన ఎప్పుడు రాలేదని కామెంట్ చేసాడు. 

అంతేకాదు ఈ గాసిప్పులు అన్ని మీడియా సృష్టించినవే అని కామెంట్ చేసాడు.  ఈసినిమా కథ ఒక క్యూట్ లవ్ స్టోరీ అని అంటూ 15 సంవత్సరాల టైం ఫ్రేంలో జరిగిన ఈ కథకు ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఏ మాత్రం సూట్ కాదని అందుకునే తాము అన్ని విధాల ఆలోచించి ఈ సినిమాకు ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ అన్న టైటిల్ ఫిక్స్ చేశాము అన్న అసలు విషయాన్ని బయట పెట్టాడు నాని. 

హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ వారం విడుదల కాబోతున్న ఈసినిమా పై భారీ అంచనాలు ఉండటంతో నాని ఈ సినిమా ప్రమోషన్ ను అప్పుడే మొదలుపెట్టి మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.అయితే నానీ కామెంట్స్ విన్న బాలకృష్ణ అభిమానులు మాత్రం ఈ క్లారిటీ సినిమా ప్రారంభంలోనే ఇవ్వవచ్చు కదా అనే కామెంట్స్ చేస్తున్నారు. 

అంతేకాదు ఇప్పటి వరకు బాలయ్య క్రేజ్ వాడుకుని చిట్టచివరకు ఇలా ట్విస్ట్ ఇవ్వడం నాని అతితెలివి తేటలకు నిదర్శనం అంటూ బాలయ్య అభిమానులు నానీని టార్గెట్ చేస్తున్నట్లు టాక్. సంక్రాంతి సినిమాల తరువాత వస్తున్న ఈ క్రేజీ మూవీకి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: