కూరగాయలలో అందరూ ఇష్టపడి అన్నిటిలోనూ వాడుకునే క్యారెట్ లో ఉన్నన్ని గుణాలు మరే కూరగాయలలోను కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మన దైనందిన ఆహారపు అలవాట్లలలో క్యారెట్ ను బాగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్ వాడకం  ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోఉపయోగ పడుతుందని  వైద్యులు చెబుతారు. 

ఈ క్యారెట్ ను జ్యూస్‌ల రూపంలో తీసుకున్నట్లయితే విటమిన్లు, ఖనిజాలు రెండింటి సమతూల్యంతో మనశరీరానికి ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాలు క్యారెట్ వల్ల లభిస్తాయి.  అంతేకాదు ఈ క్యారెట్ లో విటమిన్ ఎ, బి, సి, జి, కె, ఫైబర్ లు ఉంటాయి కాబట్టి మన శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు అనేక ఖనిజాలను ఈ క్యారెట్ మన శరీరానికి అందిస్తుంది. 

క్యారెట్ లో మినిరల్స్ మరియు లోక్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టీ టైమ్ బ్రేక్ లో క్యారెట్ ముక్కలు తీసుకుంటే మంచిది అంటారు. క్యారెట్ జ్యూస్ వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. అంతేకాదు కళ్ళ ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ ఎ కూడ ఈ క్యారెట్ లో అమితంగా లభించడంతో పాటు మన రక్తాన్ని శుద్ధి చేసే ఎలిమెంట్స్ ఈ క్యారెట్ లో ఉంటాయి.  

క్యారెట్ వినియోగం వల్ల హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతూ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి క్యారెట్ సహాయపడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించే ఈ క్యారెట్ ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం మన అనారోగ్య సమస్యల నుండి అంత త్వరగా బయట పడవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: