టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ భారీ సినిమా నిర్మాత పెట్టని కండిషన్స్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిర్మాతలు ఆ సినిమాను కొనడానికి ఆ శక్తి కనబరుస్తున్న బయ్యర్లకు పెడుతున్నారు అని గాసిప్పులు రావడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది సమ్మర్ రేస్ కు ఏప్రియల్ 8న విడుదల కాబోతున్న ఈసినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ వద్దనుంచి పెద్ద పెద్ద ఎమౌంట్స్ తో ఆఫర్స్ వస్తున్నాయిఅని టాక్.

తమకు ఈ సినిమా రైట్స్ కావాలంటూ కొందరు అప్పుడే పవన్ పై ఒత్తిడి పెంచారు అనే వార్తలు కూడ వస్తున్నాయి. అయితే ఈ సినిమా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కు చేసే ఎగ్రిమెంట్ లో ‘నో రిఫెండ్' అనే క్లాజ్ పెడుతున్నారు అనే వార్తలు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఇప్పటి వరకు ఇటువంటి క్లాజ్ ఏ భారీ సినిమా బిజినెస్ ఎగ్రిమెంట్లో పెట్టకపోవడంతో ఈ సినిమా బయ్యర్లు కొంత అయోమయానికి లోను అవుతున్నట్లు గాసిప్పులు వస్తున్నాయి. 

దీనితో కొంతమంది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా పై నిర్మాతలకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇలాంటి క్లాజ్ పెట్టారని కొందరు కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు ఈ సినిమా ఫలితం పై నమ్మకం లేక ఇటువంటి కండిషన్ పెట్టారు అంటూ మరి కొందరు సెటైర్లు వేస్తున్నట్లు టాక్.  

ఇప్పటికే ఈరోస్ సంస్థ ఈ సినిమా హక్కులను దాదాపు 80 కోట్లకు తీసుకున్న నేపధ్యంలో ఈ సంస్థ నష్టపోకుండా ఇటువంటి క్లాజ్ నిర్మాతలు పెట్టి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేరళాలో షూటింగ్ ను జరుపుకుంటున్న ఈసినిమా వర్క్ ను త్వరగా పూర్తి చేసి  త్వరలో పవన్ కాజల్ పై పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్ళడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అన్న మాటలు వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: