స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కు అమెరికాలో ఉన్న క్రేజ్ ను రుజువు చేసే మరొక ఆ సక్తికర సంఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగింది. ఎంతో ఆ శక్తికరంగా జరిగిన వరల్డ్ రెజిలింగ్ ఎంటర్ టైన్మెంట్ ఈవెంట్ లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంతోమంది తెలుగు వారు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో కూడ చాలామంది అల్లుఅర్జున్ సిక్స్ ప్యాక్ అవతారంతో కనిపిస్తున్న పోస్టర్లను ఈ ఈవెంట్ లో కెమెరాలకు కనిపించేలా చేతపుచ్చుకుని హడావిడి చేసారు.

దీనితో బన్నీ మ్యానియా అమెరికాలో ఏ ఈవెంట్ జరిగినా ఇలాగే కనిపిస్తుందేమో అంటూ సెటైర్లు పడ్డాయి. మహేష్ పవన్ ల సినిమాలు తరువాత అల్లుఅర్జున్ సినిమాలకు అమెరికాలోని తెలుగువారు బ్రహ్మరధం పడుతూ ఉంటారు. బన్నీ లేటెస్ట్ గా నటిస్తున్న ‘సరైనోడు’ సినిమాకు ఇంకా ఆ సినిమా ట్రైలర్ కూడ విడుదల కాకుండానే బన్నీ అభిమానులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బన్నీ మొట్టమొదటి సారిగా మాస్ లుక్ లో కనిపించడమే కాకుండా క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ తో కలిసి నటిస్తున్నాడు. మాస్ సినిమాలకు చిరునామాగా ఉండే బోయపాటి ఈసినిమాకు దర్శకుడు కావడంతో ఈసినిమా పై మరిన్ని అంచనాలు పెరిగి పోతున్నాయి. 

పెరిగి పోయిన ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అల్లుఅర్జున్ ఈసినిమా ద్వారా 80 కోట్ల కలెక్షన్స్ మార్క్ పై కన్ను వేసాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. రాబోతున్న సమ్మర్ సీజన్ లో విడుదల అవుతున్న టాప్ హీరోల సినిమాలలో ఈసినిమా పై ఉన్న పాజిటివ్ సంకేతాలు మరే టాప్ హీరో సినిమా పైనా లేవు. అనుకున్న విధంగా ఈసినిమా 80 కోట్లు కలెక్షన్స్ తెచ్చుకోగలిగితే బన్నీ టాప్ ౩లో స్థానం సంపాదించుకోవడం ఖాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: