మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడని తెలిసిన విషయమే.. కిక్-2 ఫ్లాప్ అయినా బెంగాల్ టైగర్ పరువు కాపాడినా ఎందుకో ఇదవరకులా రవితేజ అంటే పాస్ అయ్యే ఎనర్జీ ఎవరికి కలగట్లేదు. ఇక ఎవడో ఒకడు నుండి నిష్క్రమించడం కూడా తన మీద అపవాదాలు వచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం కెరియర్ విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్న రవితేజకు పూరి ఆఫర్ కాస్త రిలాక్స్ అయ్యేలా చేసింది. 


పూరి, రవితేజ ఇద్దరు కలిస్తే ఎలాంటి సినిమాలొస్తాయో మనకు బాగా తెలుసు. అయితే ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కోసం రాసిన ఆటోజాని కథతో రవితేజ సినిమా చేస్తున్నాడని హడావిడి చేశారు. కాని చివరకు పూరి తారక్ తో సినిమా ఓకే చేయించుకుని వచ్చాడు. మధ్యలో ఏమైంది అంటే ఎవరు ఏం మాట్లాడట్లేదు.


కష్టకాలంలో ఉన్న పూరికి రవితేజ... రవితేజకు పూరి ఇలా ఇద్దరు షేర్ చేసుకుని మంచి హిట్ సాధిస్తారనుకుంటే ఇలా మధ్యలో షాక్ ఇచ్చేశాడు పూరి. అయితే ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్న ఆ సినిమా తారక్ జనతా గ్యారేజ్ పూర్తి చేశాక మొదలవుతుంది కాబట్టి ఈలోపు రవితేజతో సినిమా చేసేస్తాడని అంటున్నారు. ఒకవేళ అలా జరిగితే ఓకే కాని.. రవితేజతో సినిమా చేయకుండా తనని కాదని తారక్ తో సినిమా చేస్తే మటుకు మాస్ మహరాజ్ మళ్లీ సంక్షోభంలో పడ్డట్టే.


ప్రస్తుతం చక్రి అనే కొత్త కుర్రాడు చెప్పిన కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ ఆ సినిమా తర్వాత పూరితో సినిమా చేస్తాడో లేదో చూడాలి. పూరి మాత్రం తన కేవ్లో తారక్ సినిమాకు సంబందించిన కథ రాసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరి రాసేది రవితేజ కోసమా.. లేక తారక్ కోసమా అన్నది త్వరలో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: