ప్రస్థుతం హీరో నాని ఈ వారం విడుదల కాబోతున్న తన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమా విషయంలో అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘భలే భలే మగాడివోయ్’ మూవీ తరువాత విడుదల కాబోతున్న ఈసినిమా ప్రమోషన్ ను నాని ఇంతవరకు ప్రారంభించక పోవడమే కాకుండా ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఇంతకు వచ్చి ఏ ప్రముఖ పత్రికలకు మీడియా సంస్థలకు నాని ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

గత సంవత్సరం విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తరువాత  నేచురల్ స్టార్ స్టాంప్ వేయించుకున్న నాని తను ప్రమోట్ చేయకపోయినా తన ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ కు భారీ ఓపెనింగ్స్ వస్తాయని మితిమీరిన విశ్వాసంతో ఉన్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

గత సంవత్సరం నానీకి వచ్చిన సూపర్ హిట్ తరువాత తన పారితోషికాన్ని కూడ భారీగా పెంచిన నాని గతంలో తక్కువ పారితోషికానికి ఒప్పుకున్నా ఈ ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ పై చిన్న చూపు చూస్తున్నాడా ? లేదంటే ఈ మౌనం వెనుక ఏమైనా వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయా ? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే హనూ రాఘవ పూడి దర్శకత్వం వహించిన ఈసినిమా సూపర్ హిట్ అయితే కాని నాని టాప్ యంగ్ హీరోల లిస్టులో స్థిరపడలేడు అన్న విషయం వాస్తవం. 

ఈ వాస్తవాలు తెలిసి ఉండి కూడ ఈసినిమా విడుదలకు ఇక కేవలం మిగిలి ఉన్నా నానీ వైపు నుంచి సందడి లేకపోవడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా కంటే ప్రచారం చాలా ముఖ్యమైన ఈరోజులలో యావరేజ్ సినిమాని కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకు వెళ్ళాలి అంటే ఎంతో కష్టపడవలసిన ఈ పరిస్థుతులలో హీరో నాని మరీ ఇంతలా ఫీల్ అవ్వడం సరికాదు అన్న కామెంట్స్ ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: