సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడం కొంతమందికే సాధ్యమవుతుంది. అలాంటి అదృష్టాలు కూడా కొంతమందినే వరిస్తాయి..ముఖ్యంగా భారతీయ చిత్రసీమలో అత్యధికంగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన ఏకైక వ్యక్తి విశ్వనటుడు కమల్ హాసన్. విచిత్ర సోదరులు, భారతీయుడు,దశావతారం ఇలా ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో మరి కొంత మంది నటులు కూడా నటించి మెప్పిస్తున్నారు..వారిలో రీసెంట్ గా విక్రమ్. శివపుత్రుడు,అపరిచితుడు, ఐ లాంటి చిత్రాల్లో అద్భుతమైన నటనతో మెప్పించాడు.

తాజాగా బాలీవుడ్ లో కూడా ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు హీరో రణదీప్ హుడా. 23 సంవత్సరాలు పాకిస్తాన్ జైల్లో మగ్గిన భారతీయుడు సరబ్ జిత్ అనే వ్యక్తి లాహోర్ లోనే మరణించాడు. ఇక ఆ పాత్రలో నటించాలని నిర్ణయం తీసుకున్న  రణదీప్ సహజత్వం కోసం ఎంతో శ్రమించాడు. ఇందుకోసం డాక్టర్ పర్యవేక్షణలో ఆహార నియమాల్లో భారీగా మార్పులు చేసుకున్నట్లు, ద్రవపదార్థలపై ఎక్కువగా ఆధారపడినట్లు సమాచారం.

 రణదీప్ హుడ


ఒకేసారి బరువు తగ్గడం ప్రమాదమని వారించినా తన పాత్రను ఛాలెంజ్‌గా భావించి ఆయన ఈ రిస్క్‌కు సిద్ధపడినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ పాత్ర కోసం ఈ పాత్ర కోసం ఆయన 28 రోజుల్లో 18కిలోల మేర బరువు తగ్గాడు.  టింగ్ మొదలైన ఫస్ట్ రోజు రణదీప్ ను డైరెక్టర్ ఒమంగ్ కుమార్ కూడా గుర్తుపట్టలేక పోయాడట. దీంతో ఒక పాత్ర కోసం తనని తాను మార్చుకున్న రణదీప్ పెద్ద సాహసం చేశాడని బీ టౌన్ వారు వ్యాఖ్యానిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: