యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ విజయం సాధించక పోవడంతో రాజ్ తరుణ్ హిట్స్ హవాకు బ్రేక్ పడింది. దీనితో ఈ యంగ్ హీరో తన నటనలో వైవిధ్యం చూపించే పాత్రలు చేయాలి అంటూ కామెంట్స్ కూడ వచ్చాయి. ఈ కామెంట్స్ రాజ్ తరుణ్ దృష్టి వరకు వెళ్ళినట్లు ఉన్నాయి. దీనితో ఈ యంగ్ హీరో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు అని అంటూ ఫిలింనగర్ లో వార్తల హడావిడి వినిపిస్తోంది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రాజ్ తరుణ్ ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించబోయే ఒక క్యూట్ లవ్ స్టోరీలో హీరోగా నటించడానికి అంగీకరించాడు అన్న వార్తలు వస్తున్నాయి. రాఘవేంద్రరావు టాప్ దర్శకుడుగా మారిన తరువాత చాల అరుదుగా చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. 

దాదాపు 2o సంవత్సరాల  క్రితం హీరో శ్రీకాంత్ తో ‘పెళ్ళి సందడి’ లాంటి ఘన విజయం సాధించిన ఒక లవ్ స్టోరీ సినిమాను తీసిన తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో బడా హీరోలతో సినిమాలు వచ్చాయి కాని చిన్న హీరోలతో సినిమాలు రాలేదు. ఆ తరువాత రాఘవేంద్రరావు తన పద్ధతి మార్చి భక్తి సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. 

వరసగా భక్తి సినిమాలు తీయడంతో విసుకు పుట్టింది కాబోలు ఈ దర్శకేంద్రుడు ప్రస్తుతం రాజ్ తరుణ్ కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి తిరిగి తన రొమాంటిక్ విశ్వరూపాన్ని చూపెట్ట బోతున్నాడు. ఆ మధ్య నాగార్జునతో రాఘవేంద్రరావు వైష్ణవ భక్తుడు హాతీరామ్ బాబా జీవితాన్ని సినిమాగా తీయబోతున్నాడు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు ఇలా రాఘవేంద్రుడు రాజ్ తరుణ్ వైపు యూటర్న్ తీసుకోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: