తెలుగు ఇండస్ట్రీలో దగ్గుబాటి వంశం నుంచి వచ్చిన హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు అయితే  ఈయన వారసుడుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్’ చిత్రం ద్వారా రానా హీరోగా పరిచయం అయ్యారు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా రాణించకపోయినా రానాకు మాత్రం ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. అంతే కాదు బాలీవుడ్ లో కూడా నటిస్తూ అక్కడ కూడా తన సత్తాచాటాడు. ఇక గత సంవత్సరం విడుదలైన ‘బాహుబలి’ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించినా కూడా హీరోకి వచ్చిన ఇమేజ్ సంపాదించాడు.

తెలుగు,తమిళ,హిందీ ఇండస్ట్రీల్లో రానాకు మంచి పేరు రావడంతో ఇప్పుడు హీరోగా మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తమిళంలో  బెంగళూర్ నాట్కల్ సినిమాలో నటించాడు..ఈ చిత్రం విడుదలైన డిసెంట్ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రంలో సమంత, ఆర్య, బాబీ సింహా, లక్ష్మీరాయ్లు నటించారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయోత్సవం సందర్భంగా బస్టాప్ ఫేమ్ దివ్య మీడియాతో మాట్లాడుతూ..రానా తనను చాలా ఇబ్బంది పెట్టాడని వివరించింది..ఆ....అయితే ఆ ఇబ్బంది వ్యక్తిగతంగా కాదండోయ్..బెంగళూర్ నాట్కల్ రానా,దివ్యలు జంటగా నటించారు.

 బెంగళూర్ నాట్కల్ చిత్రంలో రానా, శ్రీదివ్య


అయితే రానా చాలా పొడువుగా ఉండటంతో దివ్య కాస్త కురచగా ఉండటం వల్ల ఇద్దరితో షూటింగ్ చేసే సమయంలో  నానా తంటాలు పడాల్సి వచ్చిందట. ప్రతీ విషయంలో శ్రీదివ్యను హైట్గా చూపించటం కోసం తెగ కష్టపడాల్సి వచ్చిందట. మొత్తాని షూటింగ్ సమయంలో తాను పడ్డ బాదకు చాలా నవ్వోచ్చేదని సరదాగా మీడియాతో చెప్పింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: