ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజమౌళి,  జూనియర్ ఎన్టీఆర్ ల స్నేహం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. గతంలో వీరిద్దరి మధ్య మనస్ఫర్ధలు వచ్చి దూరంగా ఉన్నారని టాక్స్ వినిపించాయి. కానీ తరువాత జూనియర్ ఎన్టీఆర్ కి రాజమౌళికి స్వయంగా ఫోన్ చేసి…ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేసుకున్నాడు. ఆ విధంగా రాజమౌళి, జూనియర్ ల మధ్య స్నేహం మరింతగా బలపడుతూ వస్తుంది.


ఇదిలా ఉంటే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి, రాజమౌళి ఓ సలహాని ఇచ్చాడు. ఈ సలహాని జూనియర్ ఎన్టీఆర్ పక్కాగా ఫాలో అయి, తన అప్ కమింగ్ కి ప్లస్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నాన్నకు ప్రేమతో లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేయనున్న సినిమా ‘జనత గ్యారేజ్’. కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్న ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి సెట్స్ పైకి వెళుతుంది.


కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం బలమైన ఆర్టిస్ట్ లని తీసుకుంటున్నాడు. ఇప్పటికే మలయాళ స్టార్ మోహన్ లాల్, అలాగే మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్ ని విలన్ పాత్ర కోసం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఎన్.టి.ఆర్ కి జోడీగా సమంత, నిత్యా మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక తాజాగా ప్రేమలేఖ, సుస్వాగతం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న దేవయాని ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రని పోషిస్తుంది.


అయితే దేవయానిని తన మూవీలోకి తీసుకోవాల్సిందిగా రాజమౌళి, జూనియర్ కి చెప్పాడంట. దాంతో జూనియర్ ఈ సలహాని కొరటాల శివకి  చెబితే, కొరటాల శివ సైతం రాజమౌళి సలహాని ఇట్టే పాటించాడని అంటున్నారు. మొత్తంగా రాజమౌళి మాటను జూనియర్ ఫాలో అయి, రాజమౌళి తన మూవీకి హెల్ప్ చేశాడని అంటున్నాడంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: