ఫాంలో ఉన్న హీరోతో పెట్టుకుంటే మడతడుతుందని అంటుంటారు. ఎందుకంటే ఆ హీరోగారు ఏం చేసినా ఆ సమయంలో చెల్లుబాటు అవుతుంది కాబట్టి. ఆ విధంగానే ప్రస్తుతం ఫాలో ఉన్న హీరోతో పెట్టుకున్న టాప్ ప్రొడ్యూసర్ కూడ, తనకి మడతడేలా చేసుకున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే,‘బెంగాల్ టైగర్’తో హిట్ అందుకున్న రవితేజ తన నెక్ట్స్ మూవీ కోసం దిల్ రాజుతో కమిట్ అయ్యాడు. కానీ ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. దిల్ రాజుతో మూవీని క్యాన్సిల్ చేసుకున్న హీరోలు చాలా అరుదుగా ఉంటారు.

ఇక ఈ మధ్య కాలంలో అయితే ఎవ్వరూ లేరనే చెప్పాలి. కానీ రవితేజ మాత్రం దిల్ రాజు అయినప్పటికీ..తనతో మూవీని చేసేది లేదని పక్కకు వచ్చాడు. ఇద్దరి మధ్య రెమ్యునరేషన్ సరిగా బేరం కుదరక…గొడవలు పడి మూవీ నుండి బయటకు వచ్చారంట. రవితేజకి 9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని ఇవ్వనని దిల్ రాజు నిర్ణయించుకున్నాడంట. అయితే ప్రస్తుత మార్కెట్ వర్గాల ప్రకారం రవితేజకి 9 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చినా…వచ్చే నష్టం లేదని అంటున్నారు. అయితే దిల్ రాజు…రవితేజకి మూవీలు రాకుండా కొంత ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు.

కానీ రవితేజ మాత్రం యంగ్ డైరెక్టర్ చక్రితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా, స్టార్ కాస్టింగ్ సెలక్షన్స్ ని జరుపుకుంటుంది. ఈ మూవీకి ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ చిత్ర టీం ఫిబ్రవరిలో అన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని పూర్తి చేసుకొని మార్చ్ లో రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది. రవితేజ తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసి, దిల్ రాజుకి మరో ఝలక్ ఇచ్చాడని అంటున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలకి జీవితంలో ఇక వీరిద్దరూ కలిసి సినిమా చేసే ఛాన్స్ లేదని అంటున్నారు.

ఇక రాబిన్ హుడ్ మూవీలో హాట్ బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రవితేజ మాత్రం రాబిన్ హుడ్ కథని పక్కాగా ప్లాన్ చేసుకొని, ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు. అలాగే రాబిన్ హుడ్ మూవీకి హైప్ క్రియేట్ చేయటం కోసం ఇందులో బలమైన స్టార్ కాస్టింగ్ ని సెలక్ట్ చేసుకుంటున్నాడంట. మొత్తంగా రవితేజ వ్యవహారం, దిల్ రాజుకి మాత్రం ఏ మాత్రం నచ్ఛటం లేదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: