సాధారణంగా భార్యభర్తలు అంటే చాలా అన్యోన్యంగా ఉంటారు..ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమానురాగాలు ఉంటాయి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వివాహ బంధంతో ఒక్కటైన జంట జీవితాంతం కలిసి ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అప్పుడప్పుడు  భార్య కు భర్త.. భర్తకు భార్య అరుదైన బహుమతులు ఇచ్చి ఆశ్చర్య పరుస్తుంటారు. తాజాగా తన భార్య కోసం  పదివేల గులాబీపూలు కానుకగా పంపి అందరినీ ఆశ్చర్య పరిచాడు  ర్యాపర్ జే జెడ్‌.

తన భార్య బియాన్సే 'సూపర్ బోల్‌-50'లో ప్రదర్శన ఇస్తున్న సందర్భంగా ఊహించని ఆశ్చర్యంలో ఆమెను ముంచేత్తాడు. సాంట్‌ కార్లాలో లెవిస్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన 'సూపర్ బోల్‌ -50'లో పాప్ స్టార్ బియాన్సే తన ప్రదర్శనతో దుమ్మురేపింది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు ముందు తన భార్యపై ప్రేమను చాటుతూ ఆమెకు పదివేల గులాబీలతో జే జెడ్‌ శుభాభినందనలు తెలిపాడు.

జే జెడ్‌, బియాన్సే


మరోవైపు 'సూపర్ బోల్' మ్యూజిక్ షోలో ఆద్యంతం తన సంగీత, నృత్య విన్యాసాలతో అదరగొట్టిన పాప్ సింగర్ బియాన్సే ఆకట్టుకుంది. బ్లాక్ పాంథర్స్ పార్టీకి మద్దతుగా ఆమె ఈ షోలో ఓ ప్రదర్శన ఇవ్వడం సంచలనం సృష్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: