తెలుగు ఇండస్ట్రీలో వదల బొమ్మాళీ..వదలా.. అంటూ అరుంధతి చిత్రంలో అఘోరాగా వేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ ‘అబ్బాయిలు..అమ్మాయిలు’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగులో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. సూపర్ చిత్రంలో నాగార్జున తో సమానంగా నటించాడు. సోనుసూద్ తండ్రి శక్తిసూద్ కన్నుమూశారు. 77 ఏళ్ల శక్తిసూద్ నాలుగేళ్లుగా శ్వాస సంబంధ సమస్యతో బాధడుతున్నారు.

నిన్న మోగాలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే తండ్రితో సోనూ సూద్ మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయను  ఆస్పత్రిని తరలించాడు. వైద్యులు గుండెపోటు వచ్చిన వెంటనే శక్తి సూద్ మృతి చెందినట్టు వెల్లడించారు. సోనూసూద్ తల్లి సరోజ్‌సూద్ ఎనిమిదేళ్ల కింద చనిపోయారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీవారు ఆయన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: