గత సంవత్సరం నాగచైతన్య నటించిన ‘దోచేయ్‌’ ఘోర పరాజయం చెంది కేవలం 6 కోట్ల కలెక్షన్స్ మాత్రమే తెచ్చుకుని ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. ఈ సంఘటనతో  చైతూ నటించిన సినిమాలను ఎవరైనా అసలు కొనుక్కుంటారా అన్న అనుమానం ఫిలింనగర్ ట్రేడ్ సర్కిల్స్ లో ఏర్పడింది. అయితే ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ నాగచైతన్య నటిస్తున్న ‘ప్రేమమ్‌’ రీమేక్‌ కు 20 కోట్ల బిజెనెస్ జరగడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈసినిమాను  ‘మజ్ను’ టైటిల్‌ తో చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మలయాళ సినిమా రంగంలో వచ్చిన భారీ కలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని మన టాలీవుడ్ లో కూడ అటువంటి ఘన విజయం సాధిస్తుంది అన్న అంచనాలతో బయ్యర్లు మన టాలీవుడ్ లో ఇటువంటి సాహసం చేస్తున్నారు అని టాక్. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కుల బిజినెస్ ఇరవై నాలుగు కోట్ల వరకు పలికాయని అంటున్నారు. డిస్ట్రిబ్యూషన్‌ హక్కులతో పాటు శాటిలైట్‌ హక్కులు కూడా కలిపి కొనేసారట. అంటే తక్కువలో తక్కువ నాలుగు కోట్లు శాటిలైట్‌ రైట్స్‌కి వస్తాయని అనుకుంటే, థియేటర్ల నుంచి ఇరవై కోట్ల షేర్‌ వస్తుందని అంచనా. అయితే చైతన్య సినిమాల్లో ‘100% లవ్‌’ తప్ప ఆ రేంజిలో ఆడిన సినిమా మరొక్కటి లేదు.

సమ్మర్ లో రాబోతున్న ఈసినిమా కనీసం 30 కోట్లు వసూలు చేస్తే కాని బయ్యర్లు ఖర్చు పెట్టిన భారీ మొత్తాలు వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. శ్రుతిహాసన్ అనుపమా పరమేశ్వరన్ క్రేజ్ తో చైతన్య నేటి తరం యూత్ కు కనెక్ట్ అయి ఇంత భారీ కలెక్షన్స్ ను రాబట్టగలడా ? అన్న కామెంట్స్ ప్రస్తుతం ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: