రాబోయే ఉగాది రోజు ఏప్రిల్‌ 8 కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా విడుదల తేదీ పై క్లారిటీ రావడంతో సమ్మర్ రేస్ కు శంఖారావం పూరించాడు పవన్ కళ్యాణ్. కానీ అదే ఉగాది రోజును టార్గెట్ చేస్తూ ప్రిన్స్ మహేష్ బాబు మరో సంచలనం చేయబోతున్నాడు. ఇప్పటికే టాలీవుడ్ నెంబర్ 1 స్థానానికి పవన్ మహేష్ ల మధ్య కనిపించని పోటీ ఏర్పడ్డ నేపధ్యంలో మహేష్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించిన వార్తలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఎట్టి పరిస్తుతులలోను మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాను ఏప్రియల్ 29న విడుదల చేసి తీరాలి అని ఈ సినిమా దర్శక నిర్మాతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈసినిమాను నిర్మిస్తున్న పివిపి సంస్థ తన వేగాన్ని పెంచడమే కాకుండా ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను ఏప్రియల్ 8వ తారీఖున ఉగాది సెంటిమెంట్ తో చాల ఘనంగా జరపడానికి నిశ్చయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే ‘బ్రహ్మోత్సవం’ ఆడియో విడుదల ముహూర్తం పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్ ముహూర్తం ఒకేరోజు కావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనితో ఇది యాదృచ్ఛికంగా నిర్ణయించిన డేటా ? లేక ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు ఆడియో కార్యక్రమం పెట్టుకున్నారా ? అన్న సందేహాలు చాలామంది వ్యక్త పరుస్తున్నారు. ‘సర్దార్‌ గబ్బర్ సింగ్’  భవితవ్యం తేలే రోజు రాత్రే ‘బ్రహ్మోత్సవం’ వేడుక నిర్వహించడం వెనుక ఎదో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ఉండి ఉంటుంది అని టాలీవుడ్ విశ్లేషకుల భావన. 

ఈ వార్తలు ఇలా ఉండగా ‘బ్రహ్మోత్సవం’ సినిమా ఛానల్ రైట్స్ ప్రముఖ ఛానల్ ‘జి’ తెలుగు ఛానల్ కనీవినీ ఎరుగని షాకింగ్ రేట్ కు కొన్నట్లుగా వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘జి’ తెలుగు ఛానల్ ఈసినిమా రైట్స్ ను సుమారు 20 కోట్లకు కొన్నది అన్న గాసిప్పులు వినపడుతున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ‘బాహుబలి’ కి కూడ జరగనంత క్రేజీ బిజినెస్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు అయింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: