సినిమా అన్న తర్వాత నవరసాలు ఉంటాయి..హీరో ఓ వందమందిని సునాయసంగా గాల్లో ఎగిరించి మరీ కొట్టడం. విలన్ హీరోయిన్ చెతిలో చెప్పుదెబ్బలు,చెంపదెబ్బలు తినడం, విలన్ హీరోయిన్ రేప్ చేయడం లాంటి సన్నివేశాలు చేసే ముందు కాస్త ఇబ్బందులు పడుతుంటారు. ఇక స్టార్ హీరో ని లాగి కొట్టే సన్నివేశం చేయాల్సి వస్తే ఆ హీరోయిన్ పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే యంగ్ హీరోయిన్లు పడిచస్తారు.  ఆయన పక్కన ఒక్కసారి కనిపిస్తే చాలు స్టార్ ఇమేజ్ పెరిగిపోతుందని ఊవ్విళ్లూరుతుంటారు. అలాంటి సల్మాన్ ఖాన్ సరసన చాన్స్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ సల్మాన్ ఖాన్ లాగి చెంప పగుల గొట్టింది.

ఆ...ఇది నిజంగానే జరిగిన సంఘటన అనుకోకండీ..సినిమాలో ఓ సన్నివేశం. బాలీవుడ్ లో హాట్య బ్యూటీ క్రికెట్ హీరో కోహ్లీ ప్రేయసి అనుష్క శర్మ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో సల్మాన్ ఖాన్ ని లాగి చెంప దెబ్బ కొట్టే సన్నివేశం ఉందట అయితే ఆ సన్నివేశం ససేమిరా అన్నప్పటికీ దర్శకుడి ఒత్తిడితో కొట్టక తప్పలేదట.

సుల్తాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్


ఇకపోతే ఈ సన్నివేశంలో సల్మాన్ ని చెంప దెబ్బ కొట్టే ముందు భయం భయంగా చేయి లేవడంతో సల్మాన్ ఖాన్ దగ్గరకు పిలిచి ఇది సినిమా మాత్రమే ఇలాంటి సీన్లు చేయాల్సి వస్తే నిర్మోహమాటంగా చేయాల్సి ఉంటుందని హితబోద చేశాడట. దీంతో ఎలాగో అలా ఆ సీన్ కంప్లీట్ చేసింది అందాల భామ అనుష్క శర్మ. 



మరింత సమాచారం తెలుసుకోండి: