తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు శీను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మనోడు ఆ సినిమా అద్భుతమైన కమర్షియల్ హిట్ గా నిలిచింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘స్పీడున్నోడు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ సినిమా సుందర పాండ్యన్ ను తెలుగులో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేశాడు.

శ్రీనివాస్ తోలి చిత్రం అల్లుడు శీను కు వినాయక్ బ్రాండ్ ఉండడంతో ఆ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. అయితే ఇప్పుడీ స్పీడున్నోడు చిత్రం ఆ బ్రాండ్ ఇమేజ్ ఏమి లేకుండా వచ్చి భారీ డిజాస్టర్ గా నిలవబోతోంది. శుక్రవారం, హైదరాబాదిస్ జిహెచ్ఎంసి ఎన్నికలతో హడావిడిగా ఉండడం వలన సినిమాలు గురించి పెద్దగా అలొంచించక పోవడంతో మూవీ కలెక్షన్స్ బాగా తగ్గాయి. ఎలక్షన్స్ హడావిడి కాస్త తగ్గడంతో శనివారం, అది కొద్దిగా వసూళ్లు కైవసం చేసుకుంది.యువ్ ఎస్ లో, చిత్రం ఇప్పటివరకు కేవలం 5000 డాలర్లు వసూలు చేసింది.17 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసిన స్పీడున్నోడు ఫుల్ రన్ లో కూడా పట్టుమని పదికోట్లు కూడా దాటే పరిస్థితి కనబడట్లేదు. స్పీడున్నోడు వసూల్ చేసిన మూడు రోజుల కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.


స్పీడున్నోడు పోస్టర్


ఏరియా వైజ్ గా కలెక్షన్లు :

నైజంలో - 1. 45 కోట్లు 


సీడెడ్ లో - 0. 80 కోట్లు 


వైజాగ్ లో - 0. 63 కోట్లు 


ఈస్ట్ లో - 0. 36 కోట్లు 


వెస్ట్ లో - 0. 23 కోట్లు 


కృష్ణా లో - 0. 26 కోట్లు 


గుంటూరు లో - 0. 57 కోట్లు 


నెల్లూర్ లో - 0. 15 కోట్లు 


కర్ణాటక - 0.55 కోట్లు 


ఇతర ఏరియాలు - 0.15 కోట్లు 


మొత్తం - 5.15 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: