ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలు టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద ప్రభంజనాన్ని చూపుతున్నాయి. పవన్ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అయితే భారీ లాభాలను చూసే అవకాశం ఉందనే మార్కెట్ లో భారీ టాక్ నడుస్తుంది. అయితే తల పండిన మార్కెట్ మేధావులు మాత్రం అంత భారీగా రేటు పెట్టి, పవన్ మూవీ రైట్స్ ని సొంతం చేసుకోకపోవటమే బెటర్ అని అంటున్నారు.


ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీ విషయంలో భారీ రికార్డ్ ని సాధించాడనే విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ మూవీ సీక్వెల్ గా వస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీకి మార్కెట్ లో భారీ హైప్ క్రియేట్ అయింది.ఈ సినిమాని ఏప్రిల్ 8న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో ఎరోస్ సంస్థ భారీ మొత్తానికి వరల్డ్ వైడ్ థియోటర్ రైట్స్ ని కొనుక్కుంది.


ఇప్పడు వీరు అన్ని ఏరియాల బిజినెస్ ని క్లోజ్ చేశారు. అందులో భాగంగానే నైజాం రైట్స్ ని సైతం తాజాగా క్లోజ్ చేశారు. దాదాపు నైజాం రైట్స్ ని ఇంద్ర ఫిల్మ్స్ వారు 20 కోట్లకి తీసుకున్నారు. ఇప్పటి వరకూ నైజాంలో అత్యధిక రేటు పలికిన సినిమా ‘బాహుబలి'. ఇది 25 కోట్లకి అమ్ముడైంది. ఆ తరవాత 20 కోట్లకి అమ్ముడుపోయిన నైజాంలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీనే.


అయితే ఇండస్ట్రీ మార్కెట్ పండితుల లెక్కల ప్రకారం, ఈ మూవీకి కేవలం 17 కోట్ల వరకూ మాత్రమే అత్యధికంగా పెట్టవచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్ లపై కేరళలో ఓ పాటని షూట్ చేస్తున్నారు. లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పవర్ సినిమా ఫేం డైరెక్టర్ బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: