అదేంటి ఆటోజాని రవితేజ కదా అంటే సినిమా ఆటోజాని రవితేజ అయినా ఖమ్మంలో ఆటోజాని అక్కినేని అఖిల్ అనేస్తున్నారు. మంగళవారం ఓ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నారని తెలుసుకుని పరామర్శించడానికి వచ్చిన అఖిల్ అభిమానుల జన సందోహం అభినందనలు తెలిపారు. అక్కినేని మూడో తరం వారసుడిగా అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు.


ఖమ్మంలో అశ్విత్ రెడ్డి అనే ఆరేళ్ల కుర్రాడు కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో అక్కినేని అఖిల్ ను కలుసుకోవాలనే కోరికని వ్యక్తపరిచాడు. అయితే విషయం తెలుసుకున్న మంచు లక్ష్మి స్వచ్చంద సేవ సంస్థ మేము సైతం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాధితుడి కోసం అఖిల్ ఆటో నడపటం మూడు వేలు రూపాయలు సంపాధించి అశ్విత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. 


ఖమ్మంలో ఆటో నడుపుతున్న అఖిల్ :


ఇక అశ్విత్ ను కలవడానికి వచ్చిన అఖిల్ ను అక్కినేని అభిమానులు కలిసి తమ అభినందనలు తెలిపారు. ఇక అశ్విత్ రెడ్డికి మంచు లక్ష్మి స్వచ్చంద సంస్థ ద్వారా మూడు లక్షల రూపాయలను అందించడం జరిగింది. ఇక ఆటోజానిగా అఖిల్ అదరగొట్టేశాడని చెప్పాలి. ప్రస్తుతం అభిమానులను ఉల్లాసంలో ముంచెత్తుతున్న తన తండ్రి సోగ్గాడే చిన్ని నాయనా ఇంకా స్థానిక శ్రీనివాసా థియేటర్లో సందడి చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: