రామ్ చరణ్ నిర్ణయాల పై మెగా అభిమానులు ముఖ్యంగా చరణ్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరోలలో చరణ్ 50 కోట్ల క్లబ్ ను తన ‘మగధీర’ ద్వారా అందుకున్న టాలీవుడ్ హీరోగా రికార్డులను క్రియేట్ చేసినా ఆ రికార్డులను ఆ తరువాత కాలంలో వచ్చిన అనేకమంది టాప్ యంగ్ హీరోల సినిమాలు బ్రేక్ చేయడంతో ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల రేస్ లో చరణ్ వెనక పడిపోవడానికి అతడు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే కారణం అంటూ అభిమానులు రగిలిపోతున్నారని టాక్. 

గతసంవత్సరం విడుదలైన ‘బ్రూస్ లీ’ ఘోర పరాజయంలో దర్శకుడు పాత్రతో పాటు ఆ సినిమా కథ విషయంలో చరణ్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఒకకారణం అని అనుకుంటూ ఉంటే తిరిగి అదే తప్పును చరణ్ నటించబోతున్న ‘తని ఒరువన్’ లో చేస్తున్నాడు అంటూ చరణ్ అభిమానులు గగ్గోలు పెడుతున్నట్లు టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ను ఎంపిక చేయడం చరణ్ అభిమానులకు ఏమాత్రం ఇష్టంలేదు అన్నవార్తలు వస్తున్నాయి.

రకుల్ ప్రీత్ ఈమధ్య కాలంలో టాప్ హీరోలతో నటిస్తున్న సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతున్న నేపధ్యంలో మళ్ళీ అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ రకుల్ ను ఈసినిమాలో చరణ్ పక్కన ఎందుకు ఎంపిక చేసారు అని చరణ్ అభిమానుల వేదన. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రకుల్ నటించినా ఆసినిమా కలక్షన్స్ పరంగా అనుకున్న రికార్డులు క్రియేట్ చేయలేకపోయిన విషయాన్ని చరణ్ అభిమానులు గుర్తుకు చేస్తున్నారు.

దీనితో చరణ్ మళ్ళీ ప్రయోగాలు చేయడమే కాకుండా విలన్ కు అత్యధిక ప్రాధాన్యత ఉండే ‘ధని ఒరువన్’ లాంటి రిస్కీ రీమేక్ ను చేస్తూ మరొకసారి ప్రయోగానికి చరణ ఎందుకు శ్రీకారం చుడుతున్నాడు అని మెగాఅభిమానుల టెన్షన్. ఈ కామెంట్స్ ఇలా ఉండగా ఈరోజు చరణ్ నటిస్తున్న ‘ధని ఒరువన్’ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఈ రీమేక్ లో నటిస్తూనే సుకుమార్ దర్శకత్వంలో అదేవిధంగా కొరటాల దర్శకత్వంలో తాను నటించబోయే తదుపరి సినిమాల చర్చల విషయంలో బిజీగా ఉంటూ తన కెరియర్ ను మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: