రాజమౌళి సింపుల్ లివింగ్ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీసే రాజమౌళి ఒకొక్కసారి తన కారు అందుబాటులో లేకుంటే క్యాబ్ లోనే షూటింగ్ స్పాట్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పటికీ ఆయన ఒక అపార్ట్ మెంట్ లోనే ఉంటున్న సంగతి తెలిస్తే చాలామందికి ఆశ్కర్యం కలిగించే విషయం. 

అటువంటి రాజమౌళికి ఒక భారీ ఫామ్ హౌస్ నిర్మాణం పై కన్ను పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రాజమౌళికి హైదరాబాద్ చివర్న 20 ఎకరాల భూమి ఉంది అని టాక్. ఆ భూమిలో ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని మెయిన్ టైన్ చేస్తూ అందులో అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ఫామ్ హవుస్ కట్టుకోవాలని రాజమౌళి డ్రీమ్ అని టాక్.

దీనికి సంబంధించిన ప్లానింగ్ పనులను కూడ రాజమౌళి ఇప్పటికే పూర్తి చేసాడు అని వార్తలు వస్తున్నాయి. ఆ 20 ఎకరాలలో తోటలు పెంచుతూ అందులోనే ఓ చిన్న విలేజ్ మాదిరిగా ఒకటి రెండు చిన్న ఇళ్లు, ఓ పెద్ద ఇల్లు డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. రాజమౌళికి అత్యంత ఆప్తుడు అయిన  ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ మొత్తం ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ టాక్.

ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ తో వేయించిన ఇంటి డిజైన్ రాజమౌళి గతంలో తీసిన ‘మర్యాదరామన్న’ సినిమాలోని ఇంటి డిజైన్ లా ఉంటుందని అంటున్నారు. వైవిధ్యమైన సినిమాలు తీయడమే కాకుండా వైవిధ్య భరితంగా జీవించాలని రాజమౌళి చేస్తున్న ప్రయత్నాలకు ఈ డ్రీమ్ ఫామ్ హౌస్ ఒక ఉదాహరణ అనుకోవాలి. మరొక ట్విస్ట్ ఏమిటంటే రాజమౌళి అత్యంత సన్నిహితులైన కీరవాణి, సాయి కొర్రపాటి లకు కూడా రాజమౌళిని ఫాలో అవుతూ వారు కూడ ఫామ్ హవుస్ లు కట్టుకునే ఆలోచనలలో ఉన్నారని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: