‘మా’ టివి అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది అంటే ఆ అవార్డ్ ఫంక్షన్ కు అలీ సుమల యాంకరింగ్ లతో పాటు వారిద్దరు కలిసి నటించే స్పూఫ్ ఆ ఈవెంట్ కు హాట్ టాపిక్ గా మారుతుంది. సుమ అలీల స్పూఫ్ చూసి ఆ ఈవెంట్ కు వచ్చిన ఎంతటి వారైనా సరే పొట్టచెక్కలయ్యేలా తెగ నవ్వుకుంటారు. ఇది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్న విషయం. 

అయితే ఈసారి మా టివి అవార్డ్స్ ఫంక్షన్ కు అలీని పక్కకు పెట్టారా ? అన్న అనుమానం కలుగుతోంది. దీనికి కారణం త్వరలో జరగబోతున్న ఈ అవార్డ్స్ ఈవెంట్ కు సంబంధించి ఈసారి ప్రదర్శింప బోతున్న స్పూఫ్ లో అలీ కనిపించడం లేదు. అలీకి బదులుగా సంపూర్ణేష్ బాబు పృద్వీలు సుమతో కలిసి కనిపిస్తున్నారు. 

ఈ స్పూఫ్ లో సుమ శివగామిగా, సంపూర్ణేష్ బాబు కాలకేయుడిగా, బాహుబలిగా, రెండుపాత్రలు పృధ్వీ కట్టప్పగా నటించారు. ఈ స్పూఫ్ విడియో బిట్ ను మా టీవీ ట్వీట్ చేసింది. ఎంతో ఆసక్తి దాయకంగా ఉన్న ఈ స్పూఫ్ ఈరోజు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. అయితే అలీ ఈ స్ప్పూఫ్ లో ఎక్కడా కనిపించక పోవడంతో వెరైటీ కోసమని ఈసారి అలీని తప్పించి సంపూర్ణేష్, పృద్వీలకు అవకాశం ఇచ్చారా లేదంటే ఇంకేదైనా వ్యూహాత్మక ఎత్తుగడతో అలీని తప్పించారా అన్న సందేహాలు రావడం సహజం.

స్టార్ కమెడియన్స్ గా ఒక వెలుగువెలిగి టాలీవుడ్ ను సాసించిన బ్రహ్మానందం అలీలకు పృద్వీ సంపూర్ణేష్ లతో పాటు జబర్దస్త్ గ్రూప్ ఇస్తున్న షాక్ లకు కొనసాగింపుగా ‘మా’ టివి కూడ అలీకి అనుకోని షాక్ ఇచ్చింది అనుకోవాలి. ఈ విషయమై రకరకాల కధనాలు కామెంట్స్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: