మంచు లక్ష్మి ‘మేముసైతం' అనే సమాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక రియాలిటీ షోగా ఒక ప్రముఖ ఛానల్ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను భాగస్వామ్యం చేసి నిధుల సేకరించి అనేక సామాజిక కార్యక్రమాల కోసం వినియోగిస్తోంది మంచు లక్ష్మి. 

కొద్ది రోజుల క్రితం కూకట్‌పల్లిలోని మంజీరా మాల్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ చేత కూరగాయలు అమ్మించింది. ఇప్పుడు ఈ లిస్టులో రానా కూడ చేరడంతో రానా చేత రైతు బజార్ లో మూటలు మోసే కూలీగా రానాను మార్చి వేసింది మంచు లక్ష్మి. 

ఈమధ్య ‘బాహుబలి 2’ లో తన భయంకరమైన దుష్ట పాత్రను చూసి ఏ అమ్మాయి తనను పెళ్ళి చేసుకోదు అని రానా కామెంట్ చేసిన నేపధ్యంలో వ్యక్తిగతంగా తాను ఎంత మంచి వాడినో అందరికీ తెలియ చెప్పడానికి రానా ఇలా బరువులు మోసే కూలివాడుగా మారాడు అనుకోవాలి. ఆమధ్య చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కూడ బాధితుల మధ్యకు వెళ్ళి సేవలు చేసాడు రానా.

ఈ వార్తలు ఇలా ఉండగా రానా ఒకవైపు ‘బాహుబలి 2’ సినిమాను చేస్తూనే మరొకవైపు టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలలో వివిధ రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు. లేటెస్ట్ గా కోలీవుడ్ దర్శకుడు బాల దర్శకత్వంలో రానా మరో సినిమాను చేయబోతున్న నేపధ్యంలో వెరైటీ పాత్రలకు చిరునామా అవుతున్నాడు రానా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: