అఖిల్ తోలి సినిమా మొదలు కాక ముందు అతడి మొట్టమొదటి హీరోయిన్ గా నిహారిక ఎంపిక అవుతుంది అన్న ప్రచారం జరిగింది. అయితే ఆ కాంబినేషన్ రకరకాల కారణాలతో సెట్ కాలేదు. అఖిల్ ఆతరువాత తన పేరునే సినిమాగామార్చి తన ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు. నిహారిక మాత్రం తన పై ఎటువంటి అంచనాలు లేకుండా ప్రస్తుతం నాగశౌర్య పక్కన హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

ఈ పరిస్థుతులు ఇలా ఉండగా ఒక ప్రముఖ దర్శకుడు అఖిల్ నిహారికలను దృష్టిలో పెట్టుకుని ఒక స్క్రిప్ట్ తయారు చేసాడు అన్న ప్రచారం జరుగుతోంది. ఈకథను ఇప్పటికే నాగార్జునకు వినిపించినట్లు టాక్. అఖిల్ రెండవ సినిమా పై ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేకపోయిన నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ ఈసారి సెట్ అయ్యే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం నాగార్జునకు ఆ కథ బాగా నచ్చినా ఒక బ్యాడ్ సెంటిమెంట్ నాగార్జునను ఆలోచింప చేస్తోంది అని టాక్. చాల సంవత్సరాల క్రితం పవన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాలో మెగా అక్కినేని కుటుంబాల వారసులుగా ఆరోజులలో పవన్ సుప్రియలు నటించినా ఆ సినిమా విజయవంతం కాలేదు. 

తిరిగి అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ అఖిల్ నిహారిక కాంబినేషన్ సెట్ చేస్తే ఇప్పటికే కలిసి రాని మెగా అక్కినేని కుటుంబాల కలయిక మళ్ళీ అదే రిజల్ట్ వస్తుందా ? అన్న అనుమానంతో నాగార్జున ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సెంటిమెంట్ భయం లేకపోతే ఖచ్చితంగా అఖిల్ రెండవ సినిమాకు నిహారిక హీరోయిన్ ఎంపిక కావడం ఖాయం అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: