త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎవరికైనా అవకాశం వస్తే ఆ సినిమా కథ వినకుండా అంగీకరిస్తారు అన్నది వాస్తవం. అయితే కోలీవుడ్ హీరోయిన్ అనన్య త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘అ ఆ’ సినిమాలో నటించడానికి మొదట్లో అయిష్టత వ్యక్తపరిచిందట. ఈ విషయాలను ఈమె ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది. 

బాలనటిగా సినిమా రంగ ప్రవేశం చేసిన అనన్య ఆ తరువాత కాలంలో హీరోయిన్ గా మారి అనేక తమిళ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించింది. కొన్ని సంవత్సరాల క్రితం శర్వానంద్ హీరోగా రూపొందిన ‘జర్నీ’ సినిమాలో ఈమె నటించిన విషయం తెలిసిందే. ఈసినిమా తెలుగులో డబ్  చేసి విడుదల చేసిన సందర్భంలో ఇక్కడ కూడ బాగా విజయవంతం అయింది. అయితే ఆతరువాత కూడ అనన్యకు టాలీవుడ్ లో అవకాశాలు లేవు. 

ఆ తరువాత త్రివిక్రమ్ తీస్తున్న ‘అ ఆ’ సినిమాలో చెల్లెలు పాత్ర కోసం త్రివిక్రమ్ అనన్యను సంప్రదిస్తే మొదట్లో ఆమె ఈ పాత్ర చేయడానికి ఇష్టపడలేదట. దీనికి కారణం ఇప్పటి వరకు హీరోయిన్ పాత్రలు చేసిన తాను చెల్లెలు పాత్రలు చేయడం తనకు ఇష్టం లేదు అని త్రివిక్రమ్ కు చెప్పింది అని టాక్. అయితే త్రివిక్రమ్ పూర్తి కథను చెప్పిన తరువాత ఆ కథలోని తన ప్రాధాన్యతను గుర్తించి తాను ‘అ ఆ’ లో చెల్లలి పాత్ర చేసాను అని చెపుతోంది అనన్య.

త్రివిక్రమ్ నితిన్ తో తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉన్నా రకరకాల అనుకోని సమస్యల వల్ల ఈ సినిమా నిర్మాణం ఆలస్యం అయి ఈసినిమా కూడ సమ్మర్ రేసులోనే నిలబడింది. అయితే త్రివిక్రమ్ కు ఉన్న క్రేజ్ రీత్యా టాప్ హీరోల సినిమాలతో ఈసినిమా సమ్మర్ రేసులో పోటీ పడుతూ ఉండటంతో ఈసినిమా పై కూడ అంచనాలు పెరిగి పోతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: