‘నేను శైలజ’  సినిమాతో  క్రేజీ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకుంది కీర్తిసురేష్. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ సినిమా  ఘన విజయంతో ఆమెకు టాలీవుడ్ లో కూడ వరస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి నేపధ్యంలో మన టాప్ హీరోలు మహేష్ జూనియర్ ల దృష్టి ఆమె పై పడిందని టాక్.  

దీనితో జూనియర్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ లోనూ, మహేష్ సరసన మురుగదాస్ చిత్రంలోనూ ఆఫర్స్ వచ్చాయని అని తెలుస్తోంది. అయితే ఆ ఆఫర్స్ ఏమి ఫైనల్ కాకపోవడానికి కీర్తిసురేష్ వ్యవహారశైలి అని ఫిలింనగర్ గాసిప్. ఇలా కీర్తి సురేష్ కు తెలుగులో ఒక్క ప్రాజెక్టు కూడ  ముందుకు వెళ్లకపోవటానికి కారణం ఆమె చెపుతున్న రకరకాల కండీషన్స్ అని అంటున్నారు. 

తాను నటించబోయే సినిమా స్క్రిప్టుని తనకు పూర్తిగా ముందు వినిపించాలని దర్శకులకు ఈమె  సూచిస్తోందని టాక్. కేవలం తన క్యారక్టర్ వరకే చెప్తే కుదరని  తనకు సినిమా కథ పూర్తిగా తెలియాలని అలాగే సినిమా కొద్ది పాటి రొమాంటిక్ సీన్స్ ఉన్నా వెంటనే నో చెప్పేస్తోందని అంటున్నారు. చివరకు తన తల్లి సీనియర్ నటి మేనక కూడా తన కథల విషయంలో జోక్యం కలగచేసుకోనివ్వడంలేదని కోలీవుడ్ మీడియా గాసిప్.

అంతేకాదు కథలు వినేటప్పుడు సోలోగా తానే వింటోందని అంటున్నారు. అయితే కీర్తి సురేష్ కు టాలీవుడ్ లో ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే కోలీవుడ్ లో మాత్రం భారీ ఆఫర్లు వస్తున్నాయి. వినపడుతున్న వార్తల ప్రకారం హీరో విజయ్ పక్కన అతని 60వ చిత్రంలో కీర్తి ఓకే అయినట్లు టాక్. ఒకవైపు గ్లామర్ బ్యూటీలు మహేష్ జూనియర్ సినిమాల గురించి ఎదురు చూస్తూ ఉంటే కీర్తీసురేష్ ఇలాంటి షాక్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: