అందాల రాక్షసి సినిమాతో క్లాసిక్ ముద్ర వేసినా రెవెన్యూ రాబట్టలేకపోయాడు డైరెక్టర్ హనూ రాఘవపూడి. తన తొలి సినిమా కి స్లో స్క్రీన్ ప్లే అనే పేరు కూడా రావడం తో ఇప్పుడు కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే సూపర్ ఎంటర్టైనర్ తో రేపు ప్రేక్షకుల ముందర కి రాబోతున్నాడు. అయితే రెండవ సినిమానే అప్ కమింగ్ స్టార్ నాని లాంటి వాడితో దక్కింది అంటే అదంతా ఈజీగా దొరకలేదు అట.


ఈ సంగతి హీరో నానీనే స్వయంగా చెప్పడం విశేషం. " హను నాకు చాలా కథలు చెప్పాడు, టైం దొరికినప్పుడల్లా చాలా కథలు విన్నాను నేను కూడా. ఎప్పటికప్పుడు ప్రతీ కథనీ రిజెక్ట్ చేసేవాడిని చివరికి ఈ కథ విన్న తరవాత ఓకే చేశాను " అని చెబుతున్నాడు నానీ.


హనూ గురించి విపరీతంగా పొగిడేస్తున్నాడు మన హీరో. అతను చాలా పర్ఫెక్ట్ డైరెక్టర్ అనీ ప్రతీ ఫ్రేం లోనూ తన క్రియేటివ్ యాంగిల్ బయటకి తీయడం హనూ ని చూసి ఎవరైనా నేర్చుకోవాల్సిందే అనీ అంటున్నాడు నాని. సినిమాలో అతను ఇన్వాల్వ్ అయ్యే తీరు చూస్తో అతని ఆరోగ్యం ఏమవుతుందో అని కంగారు పడేవాళ్ళం అంటున్నాడు నాని.

 


మరింత సమాచారం తెలుసుకోండి: