నైజాం ఏరియాలో దిల్ రాజ్ కు ఉన్న పట్టు రీత్యా ఇతడు ఏ సినిమాను కొనుక్కున్నా అది ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గానే మారుతోంది. నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా వ్యూహాత్మక ఎత్తుగడలు వేయడంలో దిల్ రాజ్ ను మించిన వ్యూహ కర్త ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో కనిపించడం లేదు. ఆ మధ్య నిర్మాతగా అతడు తీసిన సినిమాలు చాల ఫెయిల్ అయిన తరువాత తిరిగి తనకు బాగా అచ్చివచ్చిన డిస్ట్రిబ్యూషన్ రంగం పై తిరిగి దృష్టి పెట్టాడు దిల్ రాజ్. 

సంక్రాంతి రేస్ కు వచ్చిన నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు నాగార్జున సినిమాలకు కూడ మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని త్వరలో విడుదల కాబోతున్న నాగార్జున ‘ఊపిరి’ అదేవిధంగా సమ్మర్ రేస్ కు రాబోతున్న మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలను దిల్ రాజ్ భారీ మొత్తాలకు నైజాం ఏరియాకు కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈ రెండు సినిమాలను పివిపి నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. 

ఈమధ్య కాలంలో పివిపి సంస్థ తీసిన సినిమాలు అన్నీ భయకరమైన ఫ్లాపులుగా మారిన నేపధ్యంలో పివిపి తీస్తున్న ఈ సినిమాలను కేవలం నాగ్ మహేష్ ల క్రేజ్ ను బట్టి భారీ మొత్తాలకు దిల్ రాజ్ కొనడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ రెండు సినిమాల మార్కెట్ పై దిల్ రాజ్ చేయి పడింది కాబట్టి ఇక మిగతా ఏరియాలలో కూడ మంచి ఫ్యాన్సీ రేట్లకు ఈ రెండు సినిమాలు అమ్మకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మహేష్ నాగార్జునులతో సన్నిహిత సంబంధాలు ఉన్న దిల్ రాజ్ ఈసారి ఏకంగా ఒకేసారి సమ్మర్ సీజన్ లో రాబోతున్న ఈ రెండు సినిమాలను కొనడం యాధృచ్చికమే అయినా దిల్ రాజ్ ఈ టాప్ హీరోల పై కడుతున్న బెట్టింగ్ వలన ఎంత వరకు లాభపడతాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: