‘జబర్దస్త్’ కామెడీ షోకు న్యాయ నిర్ణేతగా ఎంతో కాలం నుండి ఉన్న నాగబాబు ఆ కామెడీ షోలో పాల్గొంటున్న అనేకమంది ఆర్టిస్ట్ లకు టాలీవుడ్ సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి నాగబాబు ఆషో ద్వారా ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాధించుకున్న షకలక శంకర్ కు ట్విస్ట్ ఇచ్చాడు.

స్వతహాగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన షకలక శంకర్  పవన్ కోసం ప్రత్యేకంగా బోలెడు స్కిట్స్ జబర్దస్త్ ప్రోగ్రాంలో చేసాడు. పవర్ స్టార్ ను దేవుడు చేసేసి మరీ స్కిట్స్ చేసి పవన్ అభిమానులను ఆకర్షించాడు. ఈ వీరాభిమానం నచ్చి కాబోలు నాగబాబు స్వయంగా షకలక శంకర్ కు పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో పాత్ర ఇప్పించినట్లు తెలుస్తోంది.  

ఈ విషయాన్ని స్వయంగా షకలక శంకర్ తన ట్విట్ లో చెపుతూ పవన్ కు కృతజ్ఞతలు తెలపడమే కాకుండా శంకర్ సోదరుడు వరహాల బాబుకు కూడా పవన్ తన ‘సర్దార్’ సినిమాలో మరో రోల్ ఇచ్చిన విషయాన్ని బయట పెట్టాడు. వీరిద్ధరికే కాకుండా పవన్ జబర్దస్త్ లో నటిస్తున్న సుడిగాడు సుధీర్ వేణులకు కూడ పవన్ తన సినిమాలో పోలీసు కానిస్టేబుల్స్ గా పాత్రలను ఇచ్చినట్లు తెలుస్తోంది.

వీరందరి కామెడీ మధ్య పవన్ పోలీసుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో వాడే పంచ్ డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించ బోతున్నాయి అని టాక్. పవన్ దృష్టి పడింది కాబట్టి ఇప్పటికే వేగంగా దూసుకు పోతున్న షకలక శంకర్ కెరియర్ మరింత టాప్ లెవెల్ కు వెళ్ళిపోయే అవకాశం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: