టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ తనయులు, ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన సందర్భాలు చాలా తక్కవుగానే ఉన్నాయి. పెద్ద డైరెక్టర్స్ తనయులు హీరోలుగానూ, డైరెక్టర్స్ గానూ వారి టాలెంట్ ని నిరూపించుకోవాలని చూశారు కానీ, చివరికి అది కుదరలేదు. అందుకు కారణం అనేకం. ముఖ్యంగా వారిలో ఉన్న టాలెంట్ ని ప్రేక్షకులు ఏ మాత్రం  ఇష్టపడటానికి ఆసక్తిగా లేరనేది మాత్రం క్లారిటిగా తెలుస్తుంది.


అయితే ఇక్కడ తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ స్టార్ డైరెక్టర్ తనయుడు, చిన్నప్పటి నుండే తండ్రి బాటలో పయనించటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. తనే పూరి జగన్నాధ్ తనయుడైన ఆకాష్ పూరి. ఆకాష్ పూరీ బాల్య నటుడిగా పలు సినిమాలు చేసాడు. అలాగే ”ఆంధ్రా పోరి” సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఎటువంటి హంగామా లేకుండా ఆకాష్ పూరీ తన సినీ రంగానికి కావాల్సిన టెక్నిక్స్ ని కిందస్థాయి నుండే నేర్చుకుంటున్నాడు.


ఇప్పుడు ఏకంగా తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న ‘రోగ్’సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గానూ చేస్తున్నాడు. అయితే ఇక్కడ రెండు భిన్న మనస్థత్వాలు ఉన్నాయి. అకాష్ పూరీ దర్శకుడిగా సెటిల్ అవుదామని చూస్తున్నాడు. కానీ పూరీ మాత్రం అకాష్ పూరీని హీరోగా చూడాలని కోరుకుంటున్నాడు. దీంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య కొన్ని సార్లు భారీ డిస్కషన్స్ జరిగాయని అంటున్నారు.


ప్రస్తుతానికి ఫిల్మ్ కెరీర్ లో ఓనమాలు నేర్చుకుంటున్న ఆకాష్ పూరీ, కొద్ది అనుభవం తరువాత హీరోగా సెటిల్ అవుతాడా? లేక దర్శకుడిగా సెటిల్ అవుతాడా? అనేది తనే తేల్చుకోవాల్సిందని అంటున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం రోగ్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న పూరీ తనయుడిని చూసి…ఆకాష్ పూరీ డైరెక్షన్ చేయాలనే కోరిక బలంగా ఉన్నట్టుందని కొందరు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: