వివాదాల రామ్ గోపాల్ వర్మ తాను తీయబోతున్న వంగవీటి రంగ సినిమా విషయాల పై కొన్ని వర్గాల నుండి వస్తున్న వ్యతిరేకత గురించి చర్చించడానికి నిన్న సాయింత్రం ఒక ప్రముఖ ఛానల్ ముందుకు లైవ్ షోకు వచ్చాడు. ఈ కార్యక్రమంలో ఎందరో తమతమ ప్రశ్నలతో వర్మను టార్గెట్ చేసారు. 

నా సినిమాలో కమ్మ కాపు కులాల మధ్య ఘర్షణ అసలు ఉండదు. నా ఇష్టం వచ్చినట్టు సినిమా తీస్తా, నచ్చితే చూడండి లేకపోతే లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు వర్మ. ఈ కార్యక్రమంలో వివాదాల వర్మకూ, నటుడు హీరో  శివాజీకీ మధ్య లైవ్ లో నడిచిన డిస్కషన్ అత్యoత ఆసక్తి దాయకంగా మారింది. 

వర్మ కొత్తగా తీయబోతున్న వంగవీటి రంగా సినిమాలోని పాట కులాల  మధ్య చిచ్చురేపేలా ఉందంటూ నటుడు శివాజీ  అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా ఇప్పటికే ఎన్నో గాయాలు చేసి ప్రజల మనసును గాయ పరిచిన ఈ చరిత్ర పై మళ్ళి సినిమా తీసి సాధించేది ఏమిటి అని శివాజీ ఆవేశంగా ప్రశ్నించాడు. దానికి వర్మ కోపంతో ఊగిపోతూ తనకు క్లాసులు పీకుతున్నావా ? అంటూ శివాజీ పై సెటైర్లు వేసాడు వర్మ.

ఇదే చర్చలో ‘విజయవాడ రౌడీల వల్లే నేనీరోజు నా కూడు నేను తింటున్నా, నా వోడ్కా తాగుతున్నా’  అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు వర్మ. అంతేకాని తన తల్లి తల్లిదండ్రులు, గురువులు, దేవుడు బాలాజీ వల్ల కాదు అంటూ విజయవాడ రౌడీలను ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. తాను తీయబోతున్న ‘వంగవీటి’ సినిమాను ‘గాంధీ’ సినిమాతో పోలుస్తూ వర్మ చేసిన కామెంట్స్ విన్నవారికి మైండ్ బ్లాంక్ అయింది. వర్మ స్పీడ్ ను బట్టి చూస్తూ ఉంటే ఈసినిమాను ఇదే సంవత్సరం విడుదల చేసి మరో సంచలనం చేయడానికి వర్మ మానసికంగా సిద్ధపడినట్లే కనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: