పవన్ కళ్యాణ్ నుండి అతడి పిల్లలు దూరంగా రేణు దేశాయ్ వద్ద పెరుగుతున్నా రేణు తన పిల్లలకు మంచి ప్రవర్తన అలవాటు చేయడానికి తల్లిగా తన వంతు ప్రయత్నాన్ని సక్రమంగా చేస్తూ పవన్ వారసులుగా వారిని తీర్చి దిద్దడానికి రేణు దేశాయ్ ఎంతో శ్రమిస్తోంది అన్న విషయం తెలిసిందే. పవన్ కు వ్యవసాయం అన్నా పుస్తకాలు అన్నా ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. 

పవన్ ఇప్పటి వరకు 2 లక్షల పుస్తకాలను చదవడమే కాకుండా వేలాది పుస్తకాలను పవన్ వ్యక్తగత లైబ్రరీలో తన ఇంటిలో పెట్టుకున్న విషయాన్ని చాలామంది చెపుతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి అలవాటును రేణు దేశాయ్ తన కూతురు ఆధ్యను అలవాటు చేసుకోమని సూచిస్తోంది. ఈ విషయమై రేణు ఒక ట్విట్ చేస్తూ ‘పుస్తకాలు చదవడం వల్ల నీకు ఎప్పుడూ ఒంటరి అన్న భావన రాదు. అందువల్ల పుస్తకాల పై ప్రేమ పెంచుకో’ అంటూ తన కూతురు ఆధ్యకు పుస్తకాల పై ఇష్టం ఏర్పడేలా ప్రోత్సహిస్తూ ఏకంగా ఒక ట్విట్ కూడ చేసింది రేణు.

ఇప్పటికే పవన్ కొడుకు అకిరా తన తండ్రిలాగే సామాజిక కార్యకలాపాల పట్ల ఇష్ట పడుతున్నాడు అనే విషయాన్ని బయట పెట్టిన రేణు ఇప్పుడు లేటెస్ట్ గా పవన్ కూతురును పుస్తకాల ప్రేమికురాలుగా మార్చడానికి ఎంతగా ప్రయత్నిస్తోందో ఈ ట్విట్ వల్ల అర్ధం అవుతోంది. రేణు తీసిన ‘ఇష్కు వాల లవ్’ పరాజయం చెందినా ఆమె నిరుత్సాహ పడకుండా ఆమెను మరోసారి దర్శకురాలిగా మార్చి మరో సినిమా తీసే విధంగా పవన్ ప్రోత్సహిస్తున్నాడు అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. 

ఈమధ్యనే ఈమె తీసిన ‘ఇష్కు వాల  లవ్’ తెలుగు డబ్బింగ్ ను ఈటివి తమ ఛానల్ లో ప్రసారం చేయడానికి తీసుకున్న నిర్ణయం వెనుక పవన్ సహకారం ఉంది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో భార్య భర్తలుగా వీరిద్దరూ విడిపోయినా వీరి పిల్లల విషయంలో వీరిద్దరూ చూపుతున్న శ్రద్ధను చూస్తూ ఉంటే వ్యక్తులుగా వారిద్దరు దూరంగా ఉన్నా ఒకరి అభిప్రాయాలను ఒకరు ఇప్పటికీ గౌరవించుకుంటూ నే ఉన్నారు అని అనిపిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: