దర్శకుడు రాజమౌళి చీటింగ్ కేసులో చిక్కుకోవడానికి సంబంధించిన వార్తలు ఈరోజు ప్రముఖ దిన పత్రికలలో వచ్చాయి. ఆశ్చర్యకరమైన ఈ వార్తల వివరాలలోకి వెళితే హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో లోటస్ హిట్స్ అపార్ట్ మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో రాజమౌళికి ఒక అపార్ట్ మెంట్ ఉందట. 

ఈ ఫ్లాట్ ను రాజమౌళి అమ్మకానికి పెట్టగా నిర్మాత భువనేశ్వర్ అనే వ్యక్తి 41 లక్షలకు కొనుక్కోవడానికి ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ గా 2.7 లక్షలు తీసుకున్నట్లు ఆ పత్రిక సమాచారం. అయితే ఆ అపార్ట్ మెంట్ క్రమ బద్దీకరించక పోవడం 4 ఏళ్ల పాటు ఆస్థి పన్ను కట్టకపోవడంతో ఈ ఆస్థిని కొనుక్కుందాం అనుకున్న భువనేశ్వర్ కు బ్యాంక్ రుణాలు రాలేదు. అయితే ఈలోగా రాజమౌళి ఈ ప్లాట్ ను మరొకరికి విక్రయించాడట. 

దీనితో రాజమౌళి తనను మోసం చేసాడు అంటూ భువనేశ్వర్ కోర్టులో రాజమౌళి పై చీటింగ్ కేసు వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై 3 సార్లు నోటీసులు జారీ చేసినా రాజమౌళి పట్టించుకోకపోవడంతో ఈ నెల 24న ఎట్టిపరిస్థితుల్లో వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని రాజమౌళికి కోర్టు నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఒక ప్రముఖ సెలెబ్రెటీ స్థానంలో ఉన్న రాజమౌళి పై ఇటువంటి కేసులు నమోదు కావడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. మరి రాజమౌళి ఈ వ్యవహారం పై ఎలా స్పందిస్తాడో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: