నాచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే నాని లేటెస్ట్ సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ ఈరోజు రిలీజ్ అవుతుంది. నాని సినిమా దేనికి లేని పాజిటివ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే సినిమా ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా కూడా నానికి బ్లాక్ బస్టర్ ఖాయం అనేస్తున్నారు.


ఇక సినిమాలో హైలెట్ అంటూ ఉంటే అది లవ్ స్టోరీనే అని చిత్ర యూనిట్ చెబుతున్నారు. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా తన మొదటి సినిమాలో లానే ఇందులో కూడా నాచురల్ లవ్ స్టోరీని పెట్టాడని తెలుస్తుంది. సినిమా మొత్తం అనంతపురం బ్యాక్ డ్రాప్ కాబట్టి సినిమా ఫుల్ కామెడీ పంచనున్నదని ఇప్పటికే తెలుస్తుంది. 


మెహెరిన్ అందాలు కూడా ఈ సినిమాకు హెల్ప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళ్ లో సూపర్ సెన్షేషన్ మ్యూజిక్ తో దూసుకుపోతున్న విశాల్ చక్రవర్తి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. 14 రీల్స్ బ్యానర్లో రాం ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా భారీ రేంజ్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమా మీద యూత్ లో ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.


సినిమా కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్న కారణం చేత సినిమా మొదటి రోజు కలక్షన్స్ కూడా భారీగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఓవర్సీస్ టాక్ ఏంటంటే నాని మరో హిట్ కొట్టాడనే అంటున్నారు. మరి తెలుగు ప్రేక్షకులకు నాని వీర ప్రేమగాధ నచ్చుతుందా లేదా అన్నది మరో కొద్ది గంటల్లో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: