మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్ళి బాజాలు మోగబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు  వచ్చాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు చిరంజీవి నోటి వెంట ఎటువంటి స్పందన రాలేదు. కానీ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్ళికి సంబంధించిన వార్తలే కాకుండా ఆ పెళ్ళి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు కూడ మీడియాకు లీక్ కావడం అప్పుడే ప్రారంభం అయిపోయింది. 

చిరంజీవి కూతురు పెళ్ళి ఏర్పాట్లకు సంకేతంగా భావించే విఘ్నేశ్వరుడి బియ్యాన్ని తన భార్యతో కలిసి చిరంజీవి దంచుతూ కెమెరాలకు పోజు ఇచ్చిన ఫోటోలు లీక్ కావడంతో ఇప్పుడు ఆ ఫోటోలు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. చిరంజీవి కూతురు శ్రీజని చిత్తూరుకు చెందిన ఒక ఎన్ఆర్ఐతో వివహం చేయడానికి నిశ్చితార్థం జరిగినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

ఈకార్యక్రమానికి పవన్ కూడ స్వయంగా రావడమే కాకుండా శ్రీజకు కాబోయే భర్తతో కలిసి మాట్లాడినట్లు కూడ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు కొనసాగింపుగా చిరంజీవి ఇంటిలో ప్రారంభం అయిన శ్రీజ పెళ్ళి వేడుకల హడావిడికి సంబంధించిన ఫోటోల హంగామాను చూసి మెగా అభిమానులు మంచి జోష్ పై ఉన్నారు.

మెగా బ్రదర్స్ దగ్గరుండి ఈ మ్యారేజ్ ను ఘనంగా జరపబోతున్నట్లుగా ఇప్పటికే సంకేతాలు వస్తున్నాయి. ఇళ్లంతా బంధుమిత్రులతో సందడిగా మారిన మెగా కాంపౌండ్ ను చూసి మెగా అభిమానులు ముచ్చట పడుతున్నారు. ఈ మ్యారేజ్ ఈనెల కాకపోతే వచ్చేనెలలో ఉండవచ్చని ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతోంది. ఈ ఫోటోల హడావిడి బట్టి మరొక స్టార్ వెడ్డింగ్ కి టాలీవుడ్ లో కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: