అందాల రాక్షసి తో క్లాసిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ హనూ రాఘవపూడి తన తరవాతి సినిమా చెయ్యడం కోసం నాలుగు సంవత్సరాలు ఆగాల్సి ఒచ్చింది. అయితే పాజిటివ్ పాయింట్ ఏంటంటే అంత టైం తరవాత నానీ లాంటి అప్ కమింగ్ సూపర్ స్టార్ తో లవ్ స్టోరీ ని తెరకి ఎక్కించే ప్రయత్నం చేయ్యగాలిగాడు.

 

 

 తన జోనర్ అయిన లవ్ ని వదలకుండానే యాక్షన్ తో పాటు మంచి పల్లెటూరి ప్రేమకథ ని మనకి ఇవాళ ఇవ్వబోతున్నాడు హను. డైరెక్టర్ హను మీడియా తో మాట్లాడుతూ ఇందులో అనంతపురం జిల్లాకి చెందిన కుర్రాడుగా నానీ కనిపిస్తాడు అనీ కథలో బాలకృష్ణ అభిమానిగా ఉండే నాని ఎలాంటి ఇబ్బంది ఒచ్చినా బాలయ్య పేరు చెప్పుకుని తప్పించుకుంటూ ఉంటాడు అని చెబుతున్నారు.

 

 

 

ఈ సినిమా షూటింగ్ అప్పుడు నానీ చేతి మీద జై బాలయ్య టాటూ చూసి ఎవరో ఫోన్ లో ఫోటో తీసి ఇంటర్నెట్ లో పెట్టి జై బాలయ్య పేరు ఫిక్స్ అయ్యారు కానీ అసలు ఆ టైటిల్ అనుకోలేదు అంటున్నాడు డైరెక్టర్ . నిజానికి నానీ కి అందాల రాక్షసి స్టోరీ చెప్పాడట మొదట కానీ నానీ రిజెక్ట్ చెయ్యడం తో మరొక రెండు లవ్ స్టోరీ లు చెప్పాడట అవీ నచ్చకపోవడం తో తరవాత చాన్నాళ్ళ కి ఈ సినిమా స్టోరీ లైన్ వినిపించగా అది నానీ కి విపరీతంగా నచ్చేసింది అంటున్నాడు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: