దూకుడు సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లో స్టార్ ప్రొడ్యూసర్ లుగా మారిన రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర మహేష్ తో తీసిన వరస ప్లాపులు 1 నేనొక్కడినే , ఆగడు సినిమాలతో తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందుల్లో పడ్డారు. ఆ రెండు సినిమాలూ ఇచ్చిన భారీ షాక్ నుంచి తేరుకుని మినిమం అండ్ సేఫ్టీ బడ్జెట్ సినిమాల వైపు వెళుతున్నారు. మహేష్ సినిమా వలన నష్టపోయిన వీరు ప్రస్తుతం లాభాల బాట పడుతున్నారు అని తెలుస్తోంది.

 

 

 

 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో హను రాఘవపూడి డైరెక్షన్ లో నానీ తో కలిసి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ని నిర్మించిన వీరు ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ సంపాదించారు అని తెలుస్తోంది. ఇదివరకు లాగా డిస్ట్రిబ్యూషన్ వరకూ సినిమాని చేతిలో పెట్టుకోకుండా 14 రీల్స్ వారు ఈ సినిమాని ముందే అవుట్ రేట్ కి అమ్మేసారు. ఆంధ్రా తెలంగాణా తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్ లు అన్నీ కలిపి అభిషేక్ పిక్చర్స్ వారీ అమ్మేసారు. కేవలం ఓవర్ సీస్ హక్కులు మాత్రం తమ దగ్గర ఉంచుకున్నారు వీరు.

 

 

నానీ ప్రీవియస్ సినిమా భలే భలే మగాడివోయ్ కి ఓవర్ సీస్ లో మంచి కలక్షన్ లు రావడం తో నిర్మాతలు ఓవర్ సీస్ లో తామే సొంతగా 130 స్క్రీన్ లలో సినిమాని ప్రదర్శిస్తున్నారు. శాటిలైట్ ని కూడా జెమినీ వారికి నాలుగు కోట్లకి అమ్మేసారు. పదిన్నర కోట్ల బడ్జెట్ సినిమాకి దాదాపు 15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ రానే ఒచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: