తెలుగు ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ప్రవేశించిన ఆలీ అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి కామెడియన్ గా గుర్తింపు పొందాడు. కామెడీ యాక్టర్ గా, హీరోగా అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. గత కొంత కాలంగా ఆలీ బుల్లితెరపై సందడి చేస్తున్నాడు..యాంకరింగ్ చేస్తూ కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఆడియో ఫంక్షన్లు, అవార్డు ఫంక్షల్లో కూడా తనదైన స్టయిల్ లో అలరిస్తున్నాడు. అయితే గత కొంత కాలాంగా ఆలీపై చాలా రకాల విమర్షలు వచ్చిపడుతున్నాయి.  ఆ మద్య ‘ సైజ్ జీరో ’ అనుష్క తోడలపై కామెంట్ చేశాడు.

అంతే కాదు కొన్ని ఆడియో ఫంక్షన్లో యంకర్లు, హీరోయిన్ల పట్ల డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఈ విషయంలో ఆ మద్య తెలుగు రాష్ట్రాల్లో మహిళలు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో హఠాత్తుగా బర్నింగ్ స్టార్ అంటూ విపరీతమైన క్రేజ్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకొని ‘హృదయకాలేం’ చిత్రం ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అయిన సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ‘సింగం 123’ చిత్రంలో హీరోగా నటించాడు..తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త కమెడియన్ గా సందడి చేస్తున్నాడు.


మాటీవి అవార్డ్ బాహుబలి స్పూఫ్ విడియోలో సుమ,సంపూర్ణేష్ బాబు, ఫృద్వి


ఈ చిత్రంలో విభిన్న పాత్రలతో ‘కొబ్బరి మట్ట’ చిత్రంలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ సీనియర్ కమెడియన్ ఆలీకి పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.   మా టీవీ సినీ అవార్డుల ఈవెంట్ కు అతనే సుమతో కలిసి యాంకరింగ్ చేయబోతున్నాడనే సమాచారం వస్తోంది. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఫంక్షన్లో ఆలీ సందడి చేస్తుంటాడు..అంతే కాదు సుమ,ఆలీపై ఓ ఓ స్పూఫ్ కూడా తయారు చేస్తారు. కానీ ఈ సారి ఆ చాన్స్ సంపూ కొట్టేశాడట. ఈసారి కూడా స్పూఫ్ షూటింగ్ అయిపోయింది. అయితే అందులో సుమతో పాటూ సంపూర్ణేష్, పృథ్వీలు కనిపిస్తున్నారు. సుమ శివగామిగా, సంపూర్ణేష్ బాహుబలి, కాలకేయుడిగా, పృథ్వీ కట్టప్పగా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: